పల్లవి:
తెలిసెనులే ప్రియ రసికా
నీ నులి వేడి కౌగిలి అలరింతలు
నీ నును వాడి చూపుల చమరింతలు
చరణం 1:
ముసుగెంతుకే చంద్రముఖి అన్నావు
జాగెందుకే ప్రాణసఖీ అన్నావు
చెంపలు వలదన్నా .... అధరం ఆ అన్నా
చెంగుమాటున చేరి ... చిలిపిగ నవ్వేవు
చరణం 2:
వెన్నముద్దల రుచి ఎగిరి రేపల్లెలో పెరిగితివంట
కన్నెముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట
చేరని గోపిక లేదంటా ... దూరని లోగిలి లేదంటా
చెలువుల పైనే కాదమ్మా వలవల పైన మోజంటే
ఆ ఈ పరమాతుని లీలా రూపం ఎరిగినవారు ఎవరంటా !!!
నవరస పోషణ చణవనీ
నటనాంకింత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ ... మిన్నులందుకున్నవాడ
ఆ ....
నీ ఆరాధకుడను ... అస్వాదకుడను ... అనురక్తడను... నీ ప్రియభక్తడను !!!
pallavi:
tĕlisĕnule priya rasigā
nī nuli veḍi kaugili alariṁtalu
nī nunu vāḍi sūbula samariṁtalu
saraṇaṁ 1:
musugĕṁtuge saṁdramukhi annāvu
jāgĕṁduge prāṇasakhī annāvu
sĕṁpalu valadannā .... adharaṁ ā annā
sĕṁgumāḍuna seri ... silibiga navvevu
saraṇaṁ 2:
vĕnnamuddala rusi ĕgiri reballĕlo pĕrigidivaṁṭa
kannĕmuddula rusi marigi bṛṁdāvanilo tirigidivaṁṭa
serani gobiga ledaṁṭā ... dūrani logili ledaṁṭā
sĕluvula paine kādammā valavala paina mojaṁṭe
ā ī paramāduni līlā rūbaṁ ĕriginavāru ĕvaraṁṭā !!!
navarasa poṣhaṇa saṇavanī
naḍanāṁkiṁta jīvanivanī
ninnu kŏlisi vunnavāḍa ... minnulaṁdugunnavāḍa
ā ....
nī ārādhaguḍanu ... asvādaguḍanu ... anuraktaḍanu... nī priyabhaktaḍanu !!!