తలచుకుంటే మేను పులకరించేను
పల్లవి:
తలచుకుంటే మేను పులకరించేను
తలచుకుంటే మేను పులకరించేను..ఉహు..హు..ఉ...
తమకు తామే కనులు కలలు కాంచేను...ఉ..ఉ..
తలచుకుంటే మేను పులకరించేను...ఊ..ఊ..ఊ..
తనకు తానే చెలియ నన్ను చేరేను..ఉ..ఉం..ఉం...
చరణం 1:
అహ..అహ..అహ..ఆ..అహ..అహా..
ప్రియుని సూటిగ చూడ బిడియయ్యేనూ..ఓహో..ఓ..
చూడకుంటే మనసు ఎటుల నిలిచేను..ఉం..ఉం..ఉమ్మ్..
చెలుడు గుస గుసలాడ సిగ్గు కలిగేను
సిగ్గు పడితే వలపు చిగురు తొడిగేను..ఊ..ఊ..ఊ...
ఆ..అ..అ..ఆ..ఆ
తలచుకుంటే మేను పులకరించేను..ఓ..
తనకు తానే చెలియ నన్ను చేరేను..
చరణం 2:
చేయి సోకిన గుండె ఝల్లుమనియేను..ఓహొ..ఓహొ...
ఝల్లుమనీ పిదప చల్లనయ్యేనుఉమ్మ్..ఉం...
చలువ వెన్నెల వేడి గాడుపయ్యెను...
మరుల మాటల వల్ల మంచు కురిసేను...ఊ..ఊ..ఊ..
ఆ..అ..అ..ఆ..ఆ
అహ..అహా..
తలచుకుంటే మేను పులకరించేను..ఓ...
తనకు తానే చెలియ నన్ను చేరేను..
చరణం 3:
చెలుని మాటలలోనా మధువు చిందేనూ...ఊ..ఊ...
పలుకు తేనెలు బ్రోలా మైకమయ్యెను...
సోలి తడబడి ఎడద ఊయలూగేనూ..ఉ..ఉ...
ప్చ్...చ్...పడతి కాంతుని భుజము పానుపయ్యేను...ఉ..ఉ...
తలచుకుంటే మేను పులకరించేను..ఉహు..ఉహు..హు..
తనివి తీరగ ప్రేమ తానే పండేను...
అహ..అహ..హ..అహా..హ..అ..అహ..హా.....
pallavi:
talasuguṁṭe menu pulagariṁchenu
talasuguṁṭe menu pulagariṁchenu..uhu..hu..u...
tamagu tāme kanulu kalalu kāṁchenu...u..u..
talasuguṁṭe menu pulagariṁchenu...ū..ū..ū..
tanagu tāne sĕliya nannu serenu..u..uṁ..uṁ...
saraṇaṁ 1:
aha..aha..aha..ā..aha..ahā..
priyuni sūḍiga sūḍa biḍiyayyenū..oho..o..
sūḍaguṁṭe manasu ĕḍula nilisenu..uṁ..uṁ..umm..
sĕluḍu gusa gusalāḍa siggu kaligenu
siggu paḍide valabu siguru tŏḍigenu..ū..ū..ū...
ā..a..a..ā..ā
talasuguṁṭe menu pulagariṁchenu..o..
tanagu tāne sĕliya nannu serenu..
saraṇaṁ 2:
seyi sogina guṁḍĕ jhallumaniyenu..ohŏ..ohŏ...
jhallumanī pidaba sallanayyenuumm..uṁ...
saluva vĕnnĕla veḍi gāḍubayyĕnu...
marula māḍala valla maṁchu kurisenu...ū..ū..ū..
ā..a..a..ā..ā
aha..ahā..
talasuguṁṭe menu pulagariṁchenu..o...
tanagu tāne sĕliya nannu serenu..
saraṇaṁ 3:
sĕluni māḍalalonā madhuvu siṁdenū...ū..ū...
palugu tenĕlu brolā maigamayyĕnu...
soli taḍabaḍi ĕḍada ūyalūgenū..u..u...
pch...s...paḍadi kāṁtuni bhujamu pānubayyenu...u..u...
talasuguṁṭe menu pulagariṁchenu..uhu..uhu..hu..
tanivi tīraga prema tāne paṁḍenu...
aha..aha..ha..ahā..ha..a..aha..hā.....