Tala talamani kulugula vani

తల తలమణి కులుకుల వని
Year
Language

పల్లవి:

తళతళమని కులుకులవని కనపడుతుంటె మతిపోదా కుమారీ
పదపదమని తరిమిన మది కనిపెడుతుందే యెటువున్నా నీ దారీ
నిన్ను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమందే ఉదయించే లాహిరి

తళతళమని కులుకులవని కనపడుతుంటె మతిపోదా కుమారీ
పదపదమని తరిమిన మది కనిపెడుతుందే యెటువున్నా నీ దారీ

చరణం 1:

లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించనీ
ఇంత కాలం బరువైన ప్రాయం అడిగే సహయం ఒడిచేరనీ
పాపం ప్రియురాలి తాపం అణిగే ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏం కావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలీ
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి
నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో

పదపదమని తరిమిన మది కనిపెడుతుందే యెటువున్నా నీ దారీ
తళతళమని కులుకులవని కనపడుతుంటె మతిపోదా కుమారీ

చరణం 2:

లోలో రుస రుసలు రేపే తహ తహలు ఆపే సమయం ఇది
నాలో గుస గుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇది
అందుకోని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలనీ
కాని నిలువెల్ల నాటే కొన గోరు మీటే కొంటె ఆటనీ
ముద్దు పెట్టక నిద్దరపట్టక బిత్తర పోయిన కోమలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చెయ్యాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి

తళతళమని కులుకులవని కనపడుతుంటె మతిపోదా కుమారీ
పదపదమని తరిమిన మది కనిపెడుతుందే యెటువున్నా నీ దారీ
నిన్ను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమందే ఉదయించే లాహిరి

pallavi:

taḽadaḽamani kulugulavani kanabaḍuduṁṭĕ madibodā kumārī
padabadamani tarimina madi kanibĕḍuduṁde yĕḍuvunnā nī dārī
ninnu sūsi pāriboyiṁde niduriṁche rādiri
siḍigesi serugomaṁde udayiṁche lāhiri

taḽadaḽamani kulugulavani kanabaḍuduṁṭĕ madibodā kumārī
padabadamani tarimina madi kanibĕḍuduṁde yĕḍuvunnā nī dārī

saraṇaṁ 1:

logaṁ kanarāni maigaṁ jadaloni vegaṁ sĕlaregani
paigeṁ vinaleni rāgaṁ manaloni maunaṁ karigiṁchanī
iṁta kālaṁ baruvaina prāyaṁ aḍige sahayaṁ ŏḍiseranī
pābaṁ priyurāli tābaṁ aṇige pradābaṁ sūbiṁchani
kammani timmiri kammina īḍuni eṁ kāvālani aḍagāli
ukkiri bikkiri lālana ivvālī
jaṁṭagu serina ŏṁṭari ŏṁpula tuṁṭari āśhalu tīrāli
nammugu vachchina ammaḍu mĕchchina ummaḍi muchchaḍalo

padabadamani tarimina madi kanibĕḍuduṁde yĕḍuvunnā nī dārī
taḽadaḽamani kulugulavani kanabaḍuduṁṭĕ madibodā kumārī

saraṇaṁ 2:

lolo rusa rusalu rebe taha tahalu ābe samayaṁ idi
nālo gusa gusalu nīdo padanisalu pāḍe varase idi
aṁdugoni tĕrasāḍu dāḍe javarālu sāḍe vivarālanī
kāni niluvĕlla nāḍe kŏna goru mīḍe kŏṁṭĕ āḍanī
muddu pĕṭṭaga niddarabaṭṭaga bittara poyina komaligi
korina kaugili ūyala vĕyyāli
ippaḍigippuḍu sĕppaga tappina tappani tappulu sĕyyāli
haddulu paddulu iddari madhyana sardugubovāli

taḽadaḽamani kulugulavani kanabaḍuduṁṭĕ madibodā kumārī
padabadamani tarimina madi kanibĕḍuduṁde yĕḍuvunnā nī dārī
ninnu sūsi pāriboyiṁde niduriṁche rādiri
siḍigesi serugomaṁde udayiṁche lāhiri