Tabamu phalimchina shubhavelaa

తపము ఫలించిన శుభవేళా
Year
Language

పల్లవి:

తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా

ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాలా

చరణం 1:

తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలిముసుగులో దాగెదవేలా

వలచి వరించి మనసు హరించి నను దికురించగనేలా

తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా

చరణం 2:

చూపులతోనే పలుకరించుచూ చాటున వలపులు చిలకరించుచూ

కోరిక తీరే తరుణము రాగా తీరా ఇపుడీ జాగేలా

తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా
ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాలా

pallavi:

tabamu phaliṁchina śhubhaveḽā bĕdaraganelā priyurālā

ĕduḍa niluvumani maṁtramu vesi sĕdaraganelā javarālā

saraṇaṁ 1:

tĕlimabbulalo jābili valĕne melimusugulo dāgĕdavelā

valasi variṁchi manasu hariṁchi nanu diguriṁchaganelā

tabamu phaliṁchina śhubhaveḽā bĕdaraganelā priyurālā

saraṇaṁ 2:

sūbuladone palugariṁchusū sāḍuna valabulu silagariṁchusū

koriga tīre taruṇamu rāgā tīrā ibuḍī jāgelā