పల్లవి:
తాతా...బాగున్నావా..?
తా..త బాగున్నావా..ఏం తాత బా..గున్నా..వా..
తాతా...బాగున్నావా..? ఏం తాత బా..గున్నా..వా..
కంగారుగున్నావూ..కంగుతింటున్నావు..
కంగారుగున్నావూ..ఊ..కంగుతింటున్నావు..
ముడుచుకోనున్నావు ..మూల కూర్చున్నావు..
తా..త.. అ కంగారుగున్నావు కంగుతింటున్నావు
ముడుచుకోనున్నావు ..మూల కూర్చున్నావు..
తా..త.. అ బాగున్నావా.. ఏం తాత బాగున్నా..వా
చరణం 1:
మీసాలు మెలివేస్తే..వేళ్ళు నొప్పెడతాయీ
ఆహా..
కస్సుబుస్సుమని చూస్తే..కళ్ళెర్రబడతాయి
మీసాలు మెలివేస్తే..వేళ్ళు నొప్పెడతాయీ
కస్సుబుస్సుమని చూస్తే..కళ్ళెర్ర..ర్ర..ర్ర..ర్రబడతాయి
విసురుగా నడిచేవో..కాలుజారిపడతావూ
హ హ హ
విసురుగా నడిచేవూ..కాలుజారిపడతావూ
చేసినదానికి చెంపలేసుకొని వచ్చేయి మాదారి లేకుంటే గోదారీ
తా..త బాగున్నావా.. ఏం తాత బాగున్నా..వా
చరణం 2:
రాముణ్ణి ఎదిరించి రావణడేమయ్యాడు..ఊ..ఊ
కృష్ణుడిని అదిలించి కంసుడు ఏమయ్యాడు యహా..యహా యహా అహ యహా యహా
రాముణ్ణి ఎదిరించి రావణడేమయ్యాడు..ఊ..ఊ
కృష్ణుడిని అదిలించి కంసుడు ఏమయ్యాడు
నీ కంటే గొప్పోళ్ళు.. నీరుగారిపోయారు
నీ కంటే గొప్పోళ్ళు.. నీరుగారిపోయారు
నీకున్న పరువెంత..నీకున్న బలమెంత..
మా దండు కదిలిందా..నీ పని గోవిందా..
తా..త..బాగున్నావా..ఏం తాత ఆహ్ బాగున్నావా..?
చరణం 3:
నా అంతు చూస్తానని రంకెలు వేశావే..
యే..హే..హే..
ఊరంత నాదేనని విర్ర వీగిపోయావే
నా అంతు చూస్తానని రంకెలు వేశావే..
ఊరంత నాదేనని విర్ర వీగిపోయావే
వచ్చాను మొనగాణ్ణి..వరసకు మనవణ్ణి..తాతా..అహ్హా అహా
వచ్చాను మొనగాణ్ణి..వరసకు మనవణ్ణి
తాతకు దగ్గులు నేర్పే దాక నిద్దురపోనూ నిన్నొదలిపోనూ..తా..త
బాగున్నావా..ఏం తాత బాగున్నావా..
తా..త
బాగున్నావా..ఏం తాత బాగున్నావా..
తా..తా..తా..తా..త్త..ఆ