టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
పల్లవి:
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
చరణం 1:
ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
నిన్న నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ ప్రేమ నగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ కామ నగరుకి రాను .. ఇక రాను !!!
చరణం 2:
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదని
లేటుగ తెలుసుకున్నాను నా లోటుని దిద్దుకున్నాను
ఆ స్నేహనగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ మోహనగరుకు రాను .. ఇక రాను !!!
చరణం 3:
మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మనసైన పిల్లే చెప్పింది ..మనసైన పిల్లే చెప్పింది
నా మనసంతా తానై నిండింది .. నా మనసంతా తానై నిండింది
నే రాగ నగరికే పోతాను .. అనురాగ నగరుకే పోతాను .. పోతాను !!!
pallavi:
ṭāḍā.. vīḍugolu .. guḍ bai .. iṁka sĕlavu
tŏlināḍi snehidulārā sĕlarege korigalārā
saraṇaṁ 1:
priyurāli valabulagannā nunu vĕchchanidedī ledani
ninna nāgu tĕlisiṁdi ŏga sinnadi nāgu tĕlibiṁdi
ā prema nagaruge podānu .. podānu .. podānu
ī kāma nagarugi rānu .. iga rānu !!!
saraṇaṁ 2:
ichchuḍalo unna hāyi verĕchchaḍanū lene ledani
leḍuga tĕlusugunnānu nā loḍuni diddugunnānu
ā snehanagaruge podānu .. podānu .. podānu
ī mohanagarugu rānu .. iga rānu !!!
saraṇaṁ 3:
madhubātragi ĕdalo iṁka emātraṁ soḍu ledani
manasaina pille sĕppiṁdi ..manasaina pille sĕppiṁdi
nā manasaṁtā tānai niṁḍiṁdi .. nā manasaṁtā tānai niṁḍiṁdi
ne rāga nagarige podānu .. anurāga nagaruge podānu .. podānu !!!