Svararaaga gamgaa pravaahame

స్వరరాగ గంగా ప్రవాహమే
Work
Year
Language

పల్లవి:

ప్రవాహమే... గంగా ప్రవాహమే...
స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలిక

స్వరరాగ గంగ ప్రవాహమే..

చరణం 1:

కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా
స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన....

స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలిక...
స్వరరాగ గంగ ప్రవాహమే..

చరణం 2:

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతల పుష్య రాగాలులే
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే...

స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
గాన సరసీరుహ మాలిక..
స్వరరాగ గంగ ప్రవాహమే.. స్వరరాగ గంగ ప్రవాహమే..

pallavi:

pravāhame... gaṁgā pravāhame...
svararāga gaṁgā pravāhame aṁgātma saṁdhāna yogame
prāpte vasaṁtedigālige palige kuhu gīdigā
gāna sarasīruha māliga

svararāga gaṁga pravāhame..

saraṇaṁ 1:

kuṁḍala lobala niṁḍina niṁgilo urimĕnu meghaṁ innāḽḽagi
pillanagrovilo pilavani movilo kurisĕnu rāgaṁ īnāḍigi
maṭṭiṁṭirāye māṇikyamaiboye saṁgīda ratnāgarānā
svarasaptagāle kĕraḍālu kāga ā gaṁga pŏṁgiṁdi lona....

svararāga gaṁgā pravāhame aṁgātma saṁdhāna yogame
prāpte vasaṁtedigālige palige kuhu gīdigā
gāna sarasīruha māliga...
svararāga gaṁga pravāhame..

saraṇaṁ 2:

saidanya varṇāla ī saitra sumavīdhi
vinibiṁchu rāgālanaṁtālule
ī sakravāgālu ĕgire sagorālu
jagamaṁta vihariṁchu rāgālule
pilise śhaguṁtālu palige digaṁtālu
pulagiṁtala puṣhya rāgālule
mali saṁdhya dībālu guḍi gaṁṭa nādālu
maunākṣharī gāna vedālule...

svararāga gaṁgā pravāhame aṁgātma saṁdhāna yogame
prāpte vasaṁtedigālige palige kuhu gīdigā
gāna sarasīruha māliga..
svararāga gaṁga pravāhame.. svararāga gaṁga pravāhame..