స్వరములు ఏడైనా రాగాలెన్నో
పల్లవి:
స్వరములు ఏడైనా ఆ ఆ ఆ రాగాలెన్నో
హృదయం ఒక్కటైనా ఆ ఆ ఆ భావాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలు ఎన్నెన్నో !!
చరణం 1:
జననంలోన కలదు వేదన ..మరణంలోనూ కలదు వేదనా
జననంలోన కలదు వేదన ..మరణంలోనూ కలదు వేదనా
ఆ వేదనలోన ఉదయించే నవవేదాలెన్నో నాదాలెన్నెన్నో .. నాదాలెన్నెన్నో !!!
చరణం 2:
నేటికి రేపొక తీరని ప్రశ్న ..
రేపటికి మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ ఆ ..ఆ
కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో.. ఎన్నెన్నో !!
చరణం 3:
కనులున్నందుకు కలలు తప్పవు .. కలలున్నపుడు పీడకలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు .. కలలున్నపుడు పీడకలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే ..
కలల వెలుగులో కన్నీరొలికే కలత నీడలు ఎన్నెన్నో !!!
pallavi:
svaramulu eḍainā ā ā ā rāgālĕnno
hṛdayaṁ ŏkkaḍainā ā ā ā bhāvālĕnno
aḍugulu rĕṁḍainā nāṭyālĕnno
akṣharālu kŏnnainā kāvyālu ĕnnĕnno !!
saraṇaṁ 1:
jananaṁlona kaladu vedana ..maraṇaṁlonū kaladu vedanā
jananaṁlona kaladu vedana ..maraṇaṁlonū kaladu vedanā
ā vedanalona udayiṁche navavedālĕnno nādālĕnnĕnno .. nādālĕnnĕnno !!!
saraṇaṁ 2:
neḍigi rebŏga tīrani praśhna ..
rebaḍigi marunāḍŏga praśhna
kālamane gālānigi sikkī ā ..ā
kālamane gālānigi sikki telani praśhnalu ĕnnĕnno.. ĕnnĕnno !!
saraṇaṁ 3:
kanulunnaṁdugu kalalu tappavu .. kalalunnabuḍu pīḍagalalu tappavu
kanulunnaṁdugu kalalu tappavu .. kalalunnabuḍu pīḍagalalu tappavu
kalala vĕlugulo kannīrŏlige ..
kalala vĕlugulo kannīrŏlige kalada nīḍalu ĕnnĕnno !!!