Sukkalu temmannaa temchugu raanaa

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
Year
Language

పల్లవి:

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా !

చరణం 1:

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ....
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా.. !!

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే ..
వీడికి అన్నయ్య వాడే ..!

జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి ... !

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

చరణం 2:

ఒకటా రెండా .. పదులా వందా
బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా .. మతి పోయిందా
చాల్లే మీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?
వ్రతమేదో చేస్తోందటా .. అందాక ఆగాలటా
లౌక్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి ...!

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

pallavi:

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā
ninne mĕppistānu .. nanne arbistānu .. vastānammā ĕṭṭāgainā

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā !

saraṇaṁ 1:

ṣhole uṁdā ?
idigo iṁdā ....
sālle idi jvāla kādā..
tĕlugulo tīśhāre bālā.. !!

khaidī uṁdā?
idigo iṁdā..
khaidī kannayya kāde ..
vīḍigi annayya vāḍe ..!

jagadegavīruḍi kadhā..idi pāda pikchar kadā
adiloga suṁdari tala .. adigiṁchi istā padā
e māya sesainā ŏppiṁche tīrāli ... !

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā

saraṇaṁ 2:

ŏgaḍā rĕṁḍā .. padulā vaṁdā
bāgī ĕgaveyaguṁḍā .. badule tīrsedi uṁdā
mĕdaḍe uṁdā .. madi poyiṁdā
sālle mī kāgi golā .. veḽā pāḽaṁṭū ledā

evaiṁdi bhāgyaṁ kadhā? kadiliṁdā ledā kadhā?
vradamedo sestoṁdaḍā .. aṁdāga āgālaḍā
laukyaṁgā bradagālī .. saukhyāle pŏṁdāli ...!

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā
ninne mĕppistānu .. nanne arbistānu .. vastānammā ĕṭṭāgainā

sukkalu tĕmmannā tĕṁchugu rānā
sūstāvā nā mainā .. sestāne emainā