చుక్కలన్ని చూస్తున్నాయీ ..
పల్లవి:
చుక్కలన్ని చూస్తున్నాయీ ..
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ ..ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా
చందమామ వస్తున్నాడు .. చందమామ వచ్చేనూ
నిన్ను నన్ను చూసేనూ ... ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా
చరణం 1:
మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా ..
కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా
మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ ..
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
చరణం 2:
కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా ..
కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా
కొలనులోన దాగుంటే అలలు మనను చూచేనూ ..
వలపులోని తీయదనం అలలే కాజేయులే
వలపులోని తీయదనం అలలే కాజేయులే!!
చరణం 3:
నా కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా నేను నిదురపోతాలే
నేను నీకు తోడునే.. నేను నీకు నీడనే
నీవు నేను ఒకటైటే .. జీవితం స్వర్గమే
నీవు నేను ఒకటైటే .. జీవితం స్వర్గమే !!!
pallavi:
sukkalanni sūstunnāyī ..
sukkalanni sūsenū phakkuna navvenū ..ĕkkaḍaina dāguṁdāmā sakkanaina sinavāḍā
saṁdamāma vastunnāḍu .. saṁdamāma vachchenū
ninnu nannu sūsenū ... ĕkkaḍaina dāguṁdāmā aṁdamaina sinadānā
saraṇaṁ 1:
mallĕ tīgamāḍuna kaḽḽu kalubuguṁdāmā ..
kaḽḽaloni korigado manasu niṁpuguṁdāmā
mallĕ tīgamāḍuna mallĕlanni sūsenū ..
kaḽḽaloni korigalu mallĕle kājeyule
kaḽḽaloni korigalu mallĕle kājeyule
saraṇaṁ 2:
kŏlanuloni nīḽḽalo kŏṁtasebu vuṁdāmā ..
kalalugane hṛdayaṁlo valabu nilubuguṁdāmā
kŏlanulona dāguṁṭe alalu mananu sūsenū ..
valabuloni tīyadanaṁ alale kājeyule
valabuloni tīyadanaṁ alale kājeyule!!
saraṇaṁ 3:
nā kannula sāḍugā ninnu dāsuguṁṭāne
nīgaugili māḍugā nenu nidurabodāle
nenu nīgu toḍune.. nenu nīgu nīḍane
nīvu nenu ŏgaḍaiḍe .. jīvidaṁ svargame
nīvu nenu ŏgaḍaiḍe .. jīvidaṁ svargame !!!