Soosi valasi

చూచి వలచి
Year
Language

పల్లవి:

చూచి వలచి చెంతకు పిలచి
నీ సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి

చూచి వలచి చెంతకు పిలచి
సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
నా సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ

చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ

చరణం 1:

అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి
అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి
సందిట బంది చేసీ... సందిట బంది చేసీ
నా బందీ వశమైపోతి

చరణం 2:

నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి
నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ.. సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరమునైతీ

చరణం 3:

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ...
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
నీవే జగమై... నీలో సగమై.. నేటికి నిండుగ పండితి

pallavi:

sūsi valasi sĕṁtagu pilasi
nī sŏgasulu lālana sesi
nī sŏṁpula eliganaidi

sūsi valasi sĕṁtagu pilasi
sŏgasulu lālana sesi
nī sŏṁpula eliganaidi

sūsī valasī sĕṁtagu serī
nā sŏgasulu kānuga jesi
nī magasiri bānisanaidī

sūsī valasī sĕṁtagu serī
sŏgasulu kānuga jesi
nī magasiri bānisanaidī

saraṇaṁ 1:

aṁdālannī dosī ānaṁdabuḍaṁchulu sūsi
aṁdālannī dosī ānaṁdabuḍaṁchulu sūsi
saṁdiḍa baṁdi sesī... saṁdiḍa baṁdi sesī
nā baṁdī vaśhamaibodi

saraṇaṁ 2:

nūdana vadhuvai nilasī varuṇi valabula madhuvai māri
nūdana vadhuvai nilasī varuṇi valabula madhuvai māri
sakhunī ŏḍilo surigī.. sakhunī ŏḍilo surigī
koḍi sukhamula śhikharamunaidī

saraṇaṁ 3:

valabula tenĕla madhurima grolidi nidurā jagamū marasī...
valabula tenĕla madhurima grolidi nidurā jagamū marasī
nīve jagamai... nīlo sagamai.. neḍigi niṁḍuga paṁḍidi