సొగసు చూడ తరామా ...
పల్లవి:
సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా
సొగసు చూడ తరామా ...
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
చరణం 1:
అరుగు మీద నిలబడి ..నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు
చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి
ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడ తరమా .. నీ సొగసు చూడ తరమా ఆ ఆ !!
చరణం 2:
పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలి౦చికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ
చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టే
తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు
విడువిడుమ౦టున్నపుడు ఆ సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడతరమా ఆ.. ఆ!!!
పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు
పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా ఆ ఆ!!!
చరణం 3:
సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొ౦గును చెలికోకలముడిఓ అదిమి ..అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసుచూడతరమా
నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...!!!!
pallavi:
sŏgasu sūḍa taramā..
sŏgasu sūḍa taramā ā ā
nī sŏgasu sūḍa taramā ā ā
nī sŏgasu sūḍa taramā ā ā
nī ābasobālu nī tībiśhābālu
ĕrranni kobālu ĕnnĕnno dībālu a౦dame sumā
sŏgasu sūḍa tarāmā ...
nī sŏgasu sūḍa taramā ā ā
saraṇaṁ 1:
arugu mīda nilabaḍi ..nī kurulanu duvve veḽa
sejārina duvvennagu bejāruga va౦ginabuḍu
sirugoba౦ sīragaṭṭi siggunu sĕ౦guna dāsi
phakkumanna sakkadana౦ parugo parugĕttinabuḍu
ā sŏgasu sūḍa taramā .. nī sŏgasu sūḍa taramā ā ā !!
saraṇaṁ 2:
pĕṭṭi pĕṭṭani muddunu .. iṭṭe vidili౦sigŏṭṭi
gummĕtte soyagāna gummālanu dāḍuveḽa
sĕ౦gubaṭṭu paṭṭi rārammani sĕlagāḍagu digudu౦ṭe
taḍibārina kannuladŏ viḍuviḍuma౦ṭunnabuḍu
viḍuviḍuma౦ṭunnabuḍu ā sŏgasu sūḍa taramā.. nī sŏgasu sūḍadaramā ā.. ā!!!
pasibābagu pālistu paravaśhi౦si unnabuḍu
pĕdabābaḍu pāgivachchi.. mari nāgo annabuḍu
mŏṭṭigāya vesi.. shi pŏ౦ḍi. annabuḍu.. nā eḍubū nī navvulū.. harivillai vĕlasinabuḍu
ā sŏgasu sūḍa taramā. nī sŏgasu sūḍa taramā ā ā!!!
saraṇaṁ 3:
sirimallĕlu harivillabu jaḍalodurimi.. kṣhaṇame..yugamai vesi vesi
salibŏ౦gunu sĕligogalamuḍio adimi ..alisī sŏlasī kannuluvāsī
niṭṭūrbula niśhirātrilo nidarovua౦dālado..
tyāgarāja kṛtilo sīdākṛti gala iḍuva౦ṭi sŏgasusūḍadaramā
nī sŏgasu sūḍa taramā ā ā ...!!!!