Sitti potti sinnaari puttinaroju#Te

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు#Te
Year
Language

పల్లవి:

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...
చేరి మనం ఆడేపాడే పండుగరోజు...
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...
చేరి మనం ఆడేపాడే పండుగరోజు...
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట...

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...
చేరి మనం ఆడేపాడే పండుగరోజు...

చరణం 1:

కళ్ళకి పట్టీ చల్లగా కట్టి వీపుతట్టి పోతాం...
తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూద్దాం...
చురుకుతనం బుద్దిబలం ఉంటేనే చాలు...
చూడకనే తెలియు కదా నిజానిజాలు..
చూడకనే తెలియు కదా నిజానిజాలు...

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట

చరణం 2:

కన్నులుండి చూడలేరు కొంతమంది జనం...
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం...
కన్నులుండి చూడలేరు కొంతమంది జనం...
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం
మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి
మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట

చరణం 3:

అంబా అనే అరుపు విని తల్లిని చేరు లేగ
నేల మీద పిట్టను పోల్చు నింగినెగురు డేగ

చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి...

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట...

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...
చేరి మనం ఆడేపాడే పండుగరోజు...

pallavi:

siṭṭi pŏṭṭi sinnāri puṭṭinaroju...
seri manaṁ āḍebāḍe paṁḍugaroju...
siṭṭi pŏṭṭi sinnāri puṭṭinaroju...
seri manaṁ āḍebāḍe paṁḍugaroju...
veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa
veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa...

siṭṭi pŏṭṭi sinnāri puṭṭinaroju...
seri manaṁ āḍebāḍe paṁḍugaroju...

saraṇaṁ 1:

kaḽḽagi paṭṭī sallagā kaṭṭi vībudaṭṭi podāṁ...
tāginavāri perŏgasāri sĕppavoyi sūddāṁ...
surugudanaṁ buddibalaṁ uṁṭene sālu...
sūḍagane tĕliyu kadā nijānijālu..
sūḍagane tĕliyu kadā nijānijālu...

veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa

saraṇaṁ 2:

kannuluṁḍi sūḍaleru kŏṁtamaṁdi janaṁ...
dāri tappi tiragaḍame tĕlivilenidanaṁ...
kannuluṁḍi sūḍaleru kŏṁtamaṁdi janaṁ...
dāri tappi tiragaḍame tĕlivilenidanaṁ
mĕdaḍu padunu pĕṭṭāli asalu dŏṁganu paṭṭāli
mĕdaḍu padunu pĕṭṭāli asalu dŏṁganu paṭṭāli

veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa

saraṇaṁ 3:

aṁbā ane arubu vini tallini seru lega
nela mīda piṭṭanu polsu niṁginĕguru ḍega

sīgaḍaina siḍārugŏmma serunu kodi
guri tĕlisi masalugŏne nidāname nīdi...

veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa
veḍugagā ī pūḍa āḍudamā dŏṁgāḍa...

siṭṭi pŏṭṭi sinnāri puṭṭinaroju...
seri manaṁ āḍebāḍe paṁḍugaroju...