Sirunavvula tolagarilo..

చిరునవ్వుల తొలకరిలో..
Year
Language

పల్లవి:

హ..హ..హ..హ..హ

చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో

పలికెనులే.. హృదయాలే..
పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో

చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో

చరణం 1:

వసంతాలు దోసిట దూసి.. విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి.. వెలిగింతు నీ కన్నులలో

నీవే నా జీవనాడిగా...ఆ..ఆ
నీవే నా జీవనాడిగా.. ఎగిసేను గగనాల అంచులలో..

ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే.. నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ

చరణం 2:

ఉరికే సెలయేరులన్నీ... వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ.. ఉలికి పడును నీ పలుకులలో

నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ.. ధ్యానించు నా మధుర భావనలో..
ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే.. ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ

ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ..

చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ

pallavi:

ha..ha..ha..ha..ha

sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo
sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo

paligĕnule.. hṛdayāle..
paligĕnule.. hṛdayāle..
tŏlivalubula kalayigalo

sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo

saraṇaṁ 1:

vasaṁtālu dosiḍa dūsi.. visirenu nī muṁgililo
tāralane divvĕlu sesi.. vĕligiṁtu nī kannulalo

nīve nā jīvanāḍigā...ā..ā
nīve nā jīvanāḍigā.. ĕgisenu gaganāla aṁchulalo..

o..o.. viriyunule ā gaganāle.. nī vĕnnĕla kaugililo.. o..o..o
sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo..o

saraṇaṁ 2:

urige sĕlayerulannī... vŏdigibovu nī naḍagalalo
urime meghā..ā.ā lannī.. uligi paḍunu nī palugulalo

nīve nā puṇyamūrdigā..ā..ā
nīve nā puṇyamūrdigā..ā.. dhyāniṁchu nā madhura bhāvanalo..
o..o.. mĕriyunule ā bhāvanale.. iru menula alligalo..o..o
sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo..o

ā..ā.. paligĕnule.. hṛdayāle..
tŏlivalubula kalayigalo.. o..o..o..

sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo..
sirunavvula tŏlagarilo.. sirimallĕla sinugulalo..o