Sirisiriboolaa

సిరిసిరిపూలా
Work
Year
Language

పల్లవి:

ఆ ఆ ఆ .....

సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే
పులకల కొమ్మా పుణ్యాల రెమ్మా పేరంటమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా
ఊగక మన ఊయలా అలిగింది ఈ పూటా

చరణం 1:

వేయందాలలో నెలవంకా ఈ నేలవంకా దిగివచ్చేనా
శృంగారాలకే శెలవింకా జోలాలీలకే నిదురించేనా
పెళ్ళినాటి తుళ్ళిపాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డముందు అయ్యగారికీపనా
కలలే కన్నాను కమ్మగా
ఇదిగో మీ కానుకా

చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే
కలికి చిలకా ఒడినే అలికే అనురాగమే చిలికించెలే

సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా

చరణం 2:

మా సంసారమే మధుగీతం.. పూసే యవ్వనా వనజాతాలే
పిల్లాపాపలా అనుబంధం.. దాచేసిందిలే తొలిగ్రంధాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే
ఎదలో ఉన్నాడు జీవుడూ ఎదురైతే దేవుడూ

పలికే మురళీ తలపై నెమలీ అది పాటగా ఇది ఆటగా
ప్రజలో డజనై భజనే పడితే కధ కంచికే మనమింటికే

సిరిపూల చెల్లాయి పాపా సీమంతమేనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాటా
పులకల కొమ్మా పుణ్యాలరెమా పేరంటమేనాడే
ఊగక మనఊయల అలిగింది ఈ పూటా

pallavi:

ā ā ā .....

siri siri pūlā sĕllāyi pābā sīmaṁtamenāḍe
pulagala kŏmmā puṇyāla rĕmmā peraṁṭamenāḍe
āśhagā madhumāsame aḍigiṁdi ī māḍā
ūgaga mana ūyalā aligiṁdi ī pūḍā

saraṇaṁ 1:

veyaṁdālalo nĕlavaṁkā ī nelavaṁkā digivachchenā
śhṛṁgārālage śhĕlaviṁkā jolālīlage niduriṁchenā
pĕḽḽināḍi tuḽḽibāḍu tallināḍu sāgunā
ammasāḍu biḍḍamuṁdu ayyagārigībanā
kalale kannānu kammagā
idigo mī kānugā

silige valabe mŏlagai mŏlise kanubābalā kanibiṁchĕle
kaligi silagā ŏḍine alige anurāgame siligiṁchĕle

siri siri pūlā sĕllāyi pābā sīmaṁtamenāḍe
āśhagā madhumāsame aḍigiṁdi ī māḍā

saraṇaṁ 2:

mā saṁsārame madhugīdaṁ.. pūse yavvanā vanajādāle
pillābābalā anubaṁdhaṁ.. dāsesiṁdile tŏligraṁdhāle
gogulāna puṭṭinoḍu kŏṁgusāḍu kṛṣhṇuḍe
naṁdanāla aṁdamaṁta bālakṛṣhṇuḍŏkkaḍe
ĕdalo unnāḍu jīvuḍū ĕduraide devuḍū

palige muraḽī talabai nĕmalī adi pāḍagā idi āḍagā
prajalo ḍajanai bhajane paḍide kadha kaṁchige manamiṁṭige

siribūla sĕllāyi pābā sīmaṁtamenāḍe
āśhagā madhumāsame aḍigiṁdi ī māḍā
pulagala kŏmmā puṇyālarĕmā peraṁṭamenāḍe
ūgaga manaūyala aligiṁdi ī pūḍā