సిరిమల్లె వానా .. పడుతోంది లోన
పల్లవి:
సిరిమల్లె వానా .. పడుతోంది లోన .. కనిపించదే కంటికి
వడగళ్ళ వానా .. ఉరిమింది వీణా .. వినిపించదే జంటకి
తడిసే తరుణాన .. గొడుగై నే లేనా .. సిరిమల్లే
చరణం 1:
వల అనుకోనా .. వలపనుకోనా .. కలిపిన ఈ బంధం
వలదనుకున్నా .. వరమనుకున్నా .. తమరికి నే సొంతం
చినుకై వచ్చావే .. వరదై ముంచావే .. సిరిమల్లే
చరణం 2:
చిలిపిగా ఆడి .. చెలిమికి ఓడి .. గెలిచా నీ పైనా
తగువుకి చేరి .. తలపుగా మారి .. నిలిచా నీ లోనా
మనసే ఈ వింతా .. మునుపే చూసిందా .. సిరిమల్లే
pallavi:
sirimallĕ vānā .. paḍudoṁdi lona .. kanibiṁchade kaṁṭigi
vaḍagaḽḽa vānā .. urimiṁdi vīṇā .. vinibiṁchade jaṁṭagi
taḍise taruṇāna .. gŏḍugai ne lenā .. sirimalle
saraṇaṁ 1:
vala anugonā .. valabanugonā .. kalibina ī baṁdhaṁ
valadanugunnā .. varamanugunnā .. tamarigi ne sŏṁtaṁ
sinugai vachchāve .. varadai muṁchāve .. sirimalle
saraṇaṁ 2:
silibigā āḍi .. sĕlimigi oḍi .. gĕlisā nī painā
taguvugi seri .. talabugā māri .. nilisā nī lonā
manase ī viṁtā .. munube sūsiṁdā .. sirimalle