సిరిమల్లె నీవే విరిజల్లు కావే
పల్లవి:
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటి నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
చరణం 1:
ఎలదేటిపాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
చరణం 2:
మరుమల్లె తోటా మారాకు వేసే మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
pallavi:
sirimallĕ nīve virijallu kāve
varadallĕ rāve valabaṁṭi nīve
ĕnnĕllu teve ĕdamīḍi pove
saraṇaṁ 1:
ĕladeḍibāḍā sĕlaregĕ nālo sĕlaregibove madhumāsamalle
ĕlamāvi toḍā paligiṁdi nālo paligiṁchugove madi koyilalle
nī palugu nāde nā bradugu nīde
tŏlibūda navve vanadevadalle punnāgabūle sannāyi pāḍe
ĕnnĕllu teve ĕdamīḍi pove
saraṇaṁ 2:
marumallĕ toḍā mārāgu vese mārāguvese nī rāgadone
nībalugu pāḍai bradugainaveḽā bradigiṁchugove nī padamugāne
nā padamu nīve nā bradugu nīve anurāgamalle sumagīdamalle
nannallugove nāillu nīve ĕnnĕllu teve ĕdamīḍi pove