Sinnivo sinnee

సిన్నివో సిన్నీ
Year
Language

పల్లవి:

సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని

సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల
తుర్రుమని నువ్ వెళ్ళిపోతే.. తూరుపు దిక్కు ఆపేస్తుంది
ఉరుమురిమి చూసావంటే.. ఉత్తరదిక్కు ఊపేస్తుంది
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్నివో సిన్నీ ఓ సన్నజాజుల సిన్ని.. ఓ వన్నెగాజుల సిన్నీ

కల్లబొలి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను

గోదారి పొంగల్లె నామీదికి వురికొస్తే...
గొదారి పొంగల్లె నామీదికి వురికొస్తే..
రాదారి పడవల్లె తేలి తేలి పోతాను ..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్నివో సిన్నీ..
ఓ సన్నజాజుల సిన్నీ... ఓ వన్నెగాజుల సిన్నీ

చరణం 1:

కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం

గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
ఈ గుంటూరి పిలగానికి నాటు సరసం.. అందం..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్నివో సిన్నీ..
ఓ సన్నజాజుల సిన్నీ.. ఓ వన్నెగాజుల సిన్నీ

చరణం 2:

పూతరేకుల తీయదనం... నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం... నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం... నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం.. నీ పడుచుదనంలో వుందీ

కోడెగిత్త పొగరంతా... నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా... నీ కొంటే వయసులో వుందీ
అందుకేనేమో....
ఉ... అందుకేనేమో...
తుర్రుమని నే నెళ్ళాలంటే.. తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే.. ఉత్తరదిక్కు ఊపేసింది..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్నివో సిన్నీ..
సిన్ని ఈ సిన్ని.. నీ సన్నజాజుల సిన్ని..
నీ వన్నె గాజుల సిన్ని...
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని
వెన్నెలై విరబూస్తుందీ ఈ సిన్ని

సిన్నివో సిన్నీ..
ఓ సన్నజాజుల సిన్నీ..ఓ వన్నెగాజుల సిన్నీ..
ఆ..అహ హాహహ అహా
ఓ...ఒహోహో...హోహో ఓహో..

pallavi:

sinnivo sinnī.. o sannajājula sinni

sinnivo sinnī.. o sannajājula sinni o vannĕgājula
turrumani nuv vĕḽḽibode.. tūrubu dikku ābestuṁdi
urumurimi sūsāvaṁṭe.. uttaradikku ūbestuṁdi
jiṁjir jiṁjir jiṁjir jin

sinnivo sinnī o sannajājula sinni.. o vannĕgājula sinnī

kallabŏli māḍalado allari pĕḍide.. nannallari pĕḍide
vĕlluva godārilā kammestānu.. ninnu kammestānu

godāri pŏṁgallĕ nāmīdigi vurigŏste...
gŏdāri pŏṁgallĕ nāmīdigi vurigŏste..
rādāri paḍavallĕ teli teli podānu ..
jiṁjir jiṁjir jiṁjir jin

sinnivo sinnī..
o sannajājula sinnī... o vannĕgājula sinnī

saraṇaṁ 1:

kŏmma mīdi silagammagu kuluge aṁdaṁ
ī konasīma bullĕmmagi alage aṁdaṁ
kŏmma mīdi silagammagu kuluge aṁdaṁ
ī konasīma bullĕmmagi alage aṁdaṁ

guḍiloni goriṁkagu sāḍu sarasaṁ aṁdaṁ
guḍiloni goriṁkagu sāḍu sarasaṁ aṁdaṁ
ī guṁṭūri pilagānigi nāḍu sarasaṁ.. aṁdaṁ..
jiṁjir jiṁjir jiṁjir jin

sinnivo sinnī..
o sannajājula sinnī.. o vannĕgājula sinnī

saraṇaṁ 2:

pūdaregula tīyadanaṁ... nī leda sŏgasulo vuṁdī
pālamīgaḍa kammadanaṁ... nī paḍusudanaṁlo vuṁdī
pūdaregula tīyadanaṁ... nī leda sŏgasulo vuṁdī
pālamīgaḍa kammadanaṁ.. nī paḍusudanaṁlo vuṁdī

koḍĕgitta pŏgaraṁtā... nī kŏṁṭe vayasulo vuṁdī
koḍĕgitta pŏgaraṁtā... nī kŏṁṭe vayasulo vuṁdī
aṁdugenemo....
u... aṁdugenemo...
turrumani ne nĕḽḽālaṁṭe.. tūrubudikku ābesiṁdi
urumurimi sūḍālaṁṭe.. uttaradikku ūbesiṁdi..
jiṁjir jiṁjir jiṁjir jin

sinnivo sinnī..
sinni ī sinni.. nī sannajājula sinni..
nī vannĕ gājula sinni...
punnami saṁdrunilone ī sinni
vĕnnĕlai virabūstuṁdī ī sinni

sinnivo sinnī..
o sannajājula sinnī..o vannĕgājula sinnī..
ā..aha hāhaha ahā
o...ŏhoho...hoho oho..