Sigalo avi virulo agaru pogalo attarulo#

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో#
Year
Language

పల్లవి:

సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో... మసలే వలపు తొలకరులో

సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో

చరణం 1:

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు

మదిలోనా గదిలోనా..మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు ..
నిలువనీవు నా తలపులు...
మరీ మరీ ప్రియా... ప్రియా..
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు....

సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో

చరణం 2:

జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి..
చిరునవ్వుల అరవిడిన ..చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన ..చిగురాకు పెదవుల మరిగి

మరళి రాలేవు నా చూపులు...
మరీ మరీ ప్రియా.. ప్రియా..
మరళి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో...

pallavi:

sigalo avi virulo... agaru pŏgalo attarulo
maguva siggu dŏṁtaralo... masale valabu tŏlagarulo

sigalo avi virulo... agaru pŏgalo attarulo..
maguva siggu dŏṁtaralo.. masale valabu tŏlagarulo..
sigalo avi virulo

saraṇaṁ 1:

ĕduḍa nā ĕduḍa evo soyagāla māligalu
ĕduḍa nā ĕduḍa evo soyagāla māligalu

madilonā gadilonā..madilonā gadilonā
mattilina kŏtta korigalu ..
niluvanīvu nā talabulu...
marī marī priyā... priyā..
niluvanīvu nā talabulu
nī kanula ā pilubulu....

sigalo avi virulo.. agaru pŏgalo attarulo
maguva siggu dŏṁtaralo masale valabu tŏlagarulo..
sigalo avi virulo

saraṇaṁ 2:

jarigi iḍu ŏrigi paravaśhāna iḍule karigi
jarigi iḍu ŏrigi paravaśhāna iḍule karigi..
sirunavvula araviḍina ..sigurāgu pĕdavula marigi
sirunavvula araviḍina ..sigurāgu pĕdavula marigi

maraḽi rālevu nā sūbulu...
marī marī priyā.. priyā..
maraḽi rālevu nā sūbulu
madhuvugai mĕdalu tummĕdalu

sigalo avi virulo.. agaru pŏgalo attarulo..
maguva siggu dŏṁtaralo masale valabu tŏlagarulo..
sigalo avi virulo...