ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
పల్లవి:
ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా
దీవనలు ఇస్తారంటా...
ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా
చరణం 1:
తళుకు బెళుకు నక్షత్రాలు...తలంబ్రాలు తెస్తారంటా
తళుకు బెళుకు నక్షత్రాలు...తలంబ్రాలు తెస్తారంటా
మెరుపు తీగ తోరణాలు... మెరిసి మురిసి పోయేనంటా
మరపు రాని... వేడుకలంటా
ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా
చరణం 2:
పిల్లగాలి మేళగాళ్ళు... పెళ్ళిపాట పాడేరంటా
పిల్లగాలి మేళగాళ్ళు... పెళ్ళిపాట పాడేరంటా
రాజహంస జంట చేరీ ...రత్న హారతిచ్చేరంటా
రాసకేళి...జరిపేరంటా...
ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా
చరణం 3:
వన్నె చిన్నెలా ఇంధ్రధనసుపై... వెన్నెల పానుపు వేసేనంట...
వన్నె చిన్నెలా ఇంధ్రధనసుపై... వెన్నెల పానుపు వేసేనంట...
మబ్బులు తలుపులు మూసేనంటా....ఆ..ఆ...ఆ...
మబ్బులు తలుపులు మూసేనంటా...
మగువలు తొంగి చూసేరంటా ...
మనలను.. గేలి.. చేసేరంటా..
pallavi:
āgāśha paṁdirilo...nīgu nāgu pĕḽḽaṁṭā
apsarale peraṁṭāḽḽu...devadale purohidulaṁṭā
dīvanalu istāraṁṭā...
āgāśha paṁdirilo...nīgu nāgu pĕḽḽaṁṭā
apsarale peraṁṭāḽḽu...devadale purohidulaṁṭā
saraṇaṁ 1:
taḽugu bĕḽugu nakṣhatrālu...talaṁbrālu tĕstāraṁṭā
taḽugu bĕḽugu nakṣhatrālu...talaṁbrālu tĕstāraṁṭā
mĕrubu tīga toraṇālu... mĕrisi murisi poyenaṁṭā
marabu rāni... veḍugalaṁṭā
āgāśha paṁdirilo...nīgu nāgu pĕḽḽaṁṭā
saraṇaṁ 2:
pillagāli meḽagāḽḽu... pĕḽḽibāḍa pāḍeraṁṭā
pillagāli meḽagāḽḽu... pĕḽḽibāḍa pāḍeraṁṭā
rājahaṁsa jaṁṭa serī ...ratna hāradichcheraṁṭā
rāsageḽi...jariberaṁṭā...
āgāśha paṁdirilo...nīgu nāgu pĕḽḽaṁṭā
apsarale peraṁṭāḽḽu...devadale purohidulaṁṭā
saraṇaṁ 3:
vannĕ sinnĕlā iṁdhradhanasubai... vĕnnĕla pānubu vesenaṁṭa...
vannĕ sinnĕlā iṁdhradhanasubai... vĕnnĕla pānubu vesenaṁṭa...
mabbulu talubulu mūsenaṁṭā....ā..ā...ā...
mabbulu talubulu mūsenaṁṭā...
maguvalu tŏṁgi sūseraṁṭā ...
manalanu.. geli.. seseraṁṭā..