Shanivaaram memu panivaaram

శనివారం మేము పనివారం
Year
Language

పల్లవి:

శనివారం మేము పనివారం
ఆదివారం మేము ఆడువారం
శనివారం మేము పనివారం
ఆదివారం మేము ఆడువారం
వారం వారం సంసారం
వంతుల మీద కాపురం
వారం వర్జ్యం చూడని వారం
వంట వార్పు ఉద్యోగం
ఇంట బయట సద్యోగం

శనివారం మేము పనివారం
ఆదివారం మేము ఆడువారం

చరణం 1:

ముంగిట ఊడ్పుల శ్రీకారం
ఆపై ముగ్గుల సింగారం
ముంగిట ఊడ్పుల శ్రీకారం
ఆపై ముగ్గుల సింగారం
శ్రీమతి డ్యూటి మాదైనప్పుడు
ఎనిమిదింటికే ఫలహారం
అరె మఫ్టీలోనా శనివారం
ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ వ్యవహారం
మాసం మాసం వచ్చే జీతం
బ్రతుకే బంగాళాఖాతం
తీరని ఆశల సంగీతం

చరణం 2:

శనివారం మేము ఉపవాసం
ఆదివారం మాది ఏకాంతవాసం
వారం వారం సంసారం
అంతే లేని సాగరం
అదుర్తతో బ్రతికేవారం
నామర్ద మా భండారం
ఆనందానికి మేము దూరం

శనివారం మేము ఉపవాసం
ఆదివారం మాది ఏకాంతవాసం

పురుషులకేనట ఉద్యోగం
స్త్రీలకి లేదట ఆ యోగం
శ్రీవారొకరే చాకిరి చేస్తే ఎందుకూ చాలని ఆదాయం
చీర కట్టిన మగవారం
ఆ చీరకట్టడం మా నేరం
కవ్వింతలతో మాటా వాదం
కౌగిళ్ళే మా కైలాసం
కలిమి లేమి మా సొంతం

చరణం 3:

శనివారం మేము పనివారం
ఆదివారం మేము ఆడువారం
వారం వారం సంసారం
వంతుల మీద కాపురం
వారం వర్జ్యం చూడని వారం
వంట వార్పు ఉద్యోగం
ఇంట బయట సద్యోగం

శనివారం మేము ఉపవాసం
ఆదివారం మాది ఏకాంతవాసం
వారం వారం సంసారం
అంతే లేని సాగరం
అదుర్తతో బ్రతికేవారం
నామర్ద మా భండారం
ఆనందానికి మేము దూరం

pallavi:

śhanivāraṁ memu panivāraṁ
ādivāraṁ memu āḍuvāraṁ
śhanivāraṁ memu panivāraṁ
ādivāraṁ memu āḍuvāraṁ
vāraṁ vāraṁ saṁsāraṁ
vaṁtula mīda kāburaṁ
vāraṁ varjyaṁ sūḍani vāraṁ
vaṁṭa vārbu udyogaṁ
iṁṭa bayaḍa sadyogaṁ

śhanivāraṁ memu panivāraṁ
ādivāraṁ memu āḍuvāraṁ

saraṇaṁ 1:

muṁgiḍa ūḍpula śhrīgāraṁ
ābai muggula siṁgāraṁ
muṁgiḍa ūḍpula śhrīgāraṁ
ābai muggula siṁgāraṁ
śhrīmadi ḍyūḍi mādainappuḍu
ĕnimidiṁṭige phalahāraṁ
arĕ maphṭīlonā śhanivāraṁ
idi phiphṭī phiphṭī vyavahāraṁ
māsaṁ māsaṁ vachche jīdaṁ
braduge baṁgāḽākhādaṁ
tīrani āśhala saṁgīdaṁ

saraṇaṁ 2:

śhanivāraṁ memu ubavāsaṁ
ādivāraṁ mādi egāṁtavāsaṁ
vāraṁ vāraṁ saṁsāraṁ
aṁte leni sāgaraṁ
adurdado bradigevāraṁ
nāmarda mā bhaṁḍāraṁ
ānaṁdānigi memu dūraṁ

śhanivāraṁ memu ubavāsaṁ
ādivāraṁ mādi egāṁtavāsaṁ

puruṣhulagenaḍa udyogaṁ
strīlagi ledaḍa ā yogaṁ
śhrīvārŏgare sāgiri seste ĕṁdugū sālani ādāyaṁ
sīra kaṭṭina magavāraṁ
ā sīragaṭṭaḍaṁ mā neraṁ
kavviṁtalado māḍā vādaṁ
kaugiḽḽe mā kailāsaṁ
kalimi lemi mā sŏṁtaṁ

saraṇaṁ 3:

śhanivāraṁ memu panivāraṁ
ādivāraṁ memu āḍuvāraṁ
vāraṁ vāraṁ saṁsāraṁ
vaṁtula mīda kāburaṁ
vāraṁ varjyaṁ sūḍani vāraṁ
vaṁṭa vārbu udyogaṁ
iṁṭa bayaḍa sadyogaṁ

śhanivāraṁ memu ubavāsaṁ
ādivāraṁ mādi egāṁtavāsaṁ
vāraṁ vāraṁ saṁsāraṁ
aṁte leni sāgaraṁ
adurdado bradigevāraṁ
nāmarda mā bhaṁḍāraṁ
ānaṁdānigi memu dūraṁ