Shamkaraa... naadashareeraa paraa

శంకరా... నాదశరీరా పరా
Year
Language

పల్లవి:

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా...

చరణం 1:

ప్రాణము నీవని గానమె నీదని
ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ గాన విలక్షణ
రాగమె యోగమనీ...||2||

నాదోపాసన చేసిన వాడను
నీ వాడను నేనైతే ||2||

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత
కంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర
గానమిది అవధించ రా...
విని తరించరా ||శంకరా||

చరణం 2:

మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల
సిరిసిరి మువ్వలు కాబోలు ||2||

పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా ||2||

నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ... ||శంకరా||

pallavi:

śhaṁkarā... nādaśharīrā parā...
vedavihārā harā jīveśhvarā

śhaṁkarā... nādaśharīrā parā...
vedavihārā harā jīveśhvarā

śhaṁkarā...

saraṇaṁ 1:

prāṇamu nīvani gānamĕ nīdani
prāṇamĕ gānamanī...
mauna visakṣhaṇa gāna vilakṣhaṇa
rāgamĕ yogamanī...||2||

nādobāsana sesina vāḍanu
nī vāḍanu nenaide ||2||

dhikkarīṁdrajida himagirīṁdrasida
kaṁdharā nīlagaṁdharā
kṣhudrulĕrugani rudravīṇa nirṇidra
gānamidi avadhiṁcha rā...
vini tariṁcharā ||śhaṁkarā||

saraṇaṁ 2:

mĕrise mĕrubulu murise pĕdavula
sirusiru navvulu kābolu
urime urumulu sarisari naḍanala
sirisiri muvvalu kābolu ||2||

paravaśhāna śhirasūgaṁgā
dharagu jārĕnā śhivagaṁgā ||2||

nā gānalahari nuvu munugaṁga
ānaṁdavṛṣhṭi ne taḍavaṁgā ā... ā... ā... ā... ||śhaṁkarā||