Shaamgure shaamgure mamada ninu kore

ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
Year
Language

పల్లవి:

ఛాంగురే.. ఛాంగురే.. మమత నిను కోరే
ఛాంగురే.. ఛాంగురే.. చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు.. చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో.. తిరిగి తెల్లవారే

ఛాంగురే.. ఛాంగురే.. మమత నిను కోరే
ఛాంగురే.. ఛాంగురే.. చెలిమి నిను చేరే

చరణం 1:

అన్నయ్యా.. నీ అలక పైపైనేనని తెలుసును లేవయ్యా

తమ్ముడూ.. నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా

ఎన్ని కళలో.. వెంటతెచ్చెనంట
చూడ ముచ్చటైన మురిపెం

ఎన్ని సిరులో.. రాసిపోసెనంట
సంకురాత్రి వంటి సమయం

మనసే కోరే.. అనుబంధాలు దరిచేరే
తరతరాల తరగని వరాలగని అని
మనింటి మమతని మరిమరి పొగిడిన
పదుగురి కను వెలుగై...
సాగుతున్న వేళలో.. మనది పూలదారే

ఛాంగురే.. ఛాంగురే.. మమత నిను కోరే
ఛాంగురే.. ఛాంగురే.. చెలిమి నిను చేరే

చరణం 2:

కొమ్మలో.. కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం
గొంతులో.. మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం

ఎంత వరమో.. రామచంద్రుడంటి అన్నగారి అనురాగం
ఏమి ఋణమో.. లక్ష్మణుణ్ని మించి చిన్నవాని అనుబంధం

ఇపుడే చేరే.. పది ఉగాదులొకసారే
ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ
అనేక జన్మల చిగురులు తొడిగిన
చెలిమికి కలకాలం...
స్వాగతాలు పాడనీ.. సంబరాల హోరే

ఛాంగురే.. ఛాంగురే
ఛాంగురే.. ఛాంగురే

pallavi:

shāṁgure.. shāṁgure.. mamada ninu kore
shāṁgure.. shāṁgure.. sĕlimi ninu sere
allugunna baṁdhālu.. salludunna saṁdanālu
vĕlluvaina veḽalo.. tirigi tĕllavāre

shāṁgure.. shāṁgure.. mamada ninu kore
shāṁgure.. shāṁgure.. sĕlimi ninu sere

saraṇaṁ 1:

annayyā.. nī alaga paibainenani tĕlusunu levayyā

tammuḍū.. nīgu tĕlusanna saṁgadi nāgu tĕlusayyā

ĕnni kaḽalo.. vĕṁṭadĕchchĕnaṁṭa
sūḍa muchchaḍaina muribĕṁ

ĕnni sirulo.. rāsibosĕnaṁṭa
saṁkurātri vaṁṭi samayaṁ

manase kore.. anubaṁdhālu darisere
taradarāla taragani varālagani ani
maniṁṭi mamadani marimari pŏgiḍina
paduguri kanu vĕlugai...
sāgudunna veḽalo.. manadi pūladāre

shāṁgure.. shāṁgure.. mamada ninu kore
shāṁgure.. shāṁgure.. sĕlimi ninu sere

saraṇaṁ 2:

kŏmmalo.. koyilanu kammaga lebina kilagila saṁgīdaṁ
gŏṁtulo.. melugŏni koḍi muvvala kŏṁṭĕ kolāḍaṁ

ĕṁta varamo.. rāmasaṁdruḍaṁṭi annagāri anurāgaṁ
emi ṛṇamo.. lakṣhmaṇuṇni miṁchi sinnavāni anubaṁdhaṁ

ibuḍe sere.. padi ugādulŏgasāre
priyasvarālu siligina vasaṁta vanamuga
anega janmala sigurulu tŏḍigina
sĕlimigi kalagālaṁ...
svāgadālu pāḍanī.. saṁbarāla hore

shāṁgure.. shāṁgure
shāṁgure.. shāṁgure