Seppammaa seppammaa seppammaa ..

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ..
Work
Year
Language

పల్లవి:

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం

చరణం 1:

వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఏంటి ఎటు చూసినా
చెంప గిల్లి పోతావే ఏంటి గాలి వేలితోన
అంట గొడవ పెడతావే ఏంటి నిద్దరోతూ ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైనా
ఇదేమల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పనూ

చరణం 2:

నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా
యేడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకొన్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా
లేని పోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడకా మహా బోర్ గా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్న అయ్యో రామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా I LOVE YOUచెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
I LOVE YOU I LOVE YOU I LOVE YOU I LOVE YOU I LOVE YOU

pallavi:

sĕppammā sĕppammā sĕppammā
sĕppammā sĕppesĕy aṁṭoṁdi o ārāḍaṁ
tappammā tappammā tappammā tappammā
āgammā aṁṭoṁdi o momāḍaṁ
nuvvaṁṭe mari adedo idi aneddāmane unnadī
phalānā ani tĕlīde mari ĕlā nīgu sĕbāladī

sĕppammā sĕppammā sĕppammā
sĕppammā sĕppesĕy aṁṭoṁdi o ārāḍaṁ

saraṇaṁ 1:

vĕṁṭa tarumudunnāve eṁṭi ĕṁta tappugunnā
kaṁṭigĕduru paḍadāve eṁṭi ĕḍu sūsinā
sĕṁpa gilli podāve eṁṭi gāli velidona
aṁṭa gŏḍava pĕḍadāve eṁṭi niddarodū unnā
asalu nīgu ā sŏrave eṁṭi tĕliyagaḍugudunnā
ŏṁṭigā uṁḍa nīyaveṁṭi ŏkka nimiṣhamainā
idemallari bhariṁchedĕlā aṁṭū ninnĕlā kasaranū
nuvveṁ sesinā bāguṁṭuṁdani nijaṁ nīgĕlā sĕppanū

saraṇaṁ 2:

nuvvu navvuduṁṭe ĕṁto sūḍamuchchaḍainā
yeḍibiṁchabuddavuduṁdi ĕṭṭāgainā
muddugāne uṁṭāvemo mūdi muḍusugŏnnā
kāsta kassumanave ĕṁta kavviṁchinā
ninnu rĕchchagŏḍudū nene oḍibodū unnā
leni ponī ukroṣhaṁto uḍugĕttanā
ideṁ sūḍagā mahā bor gā ĕḍo nuvvu sūstū unnā
adeṁṭo mari ā pŏgare nachchi paḍi sastunna ayyo rāmā

sĕppammā sĕppammā sĕppammā
sĕppammā sĕppesĕy aṁṭoṁdi o ārāḍaṁ
tappammā tappammā tappammā tappammā
āgammā aṁṭoṁdi o momāḍaṁ
nuvaṁṭe mari adedo idi aneddāmane unnadi
phalānā ani tĕlīde mari ĕlā nīgu sĕbāladī

sĕppammā sĕppammā sĕppammā I LOVE YOUsĕppesĕy aṁṭoṁdi o ārāḍaṁ
I LOVE YOU I LOVE YOU I LOVE YOU I LOVE YOU I LOVE YOU