చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే
పల్లవి:
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే..చెప్పకనే..
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని..
చరణం 1:
చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా...అహా..అహా..అహ
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా..అహా..అహా..అహా
పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే....ఏ..ఏ..ఏ
చెప్పకనే..చెప్పకనే..
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చరణం 2:
తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే ఒయ్యారమా
అల్లాడిపోయే యీ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే..చెప్పకనే..
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
pallavi:
kanulu vippi kaluva mŏgga jābillini sūsĕnu
tamagaṁto pālabugga tŏlimuddunu korĕnu
taḍiyārani pĕdavulabai
tŏṇigina vĕnnĕla mĕrubulu
sĕppagane..sĕppagane..
sĕppagane sĕbudunnavi ide ide premani
sĕppagane sĕbudunnavi ide ide premani..
saraṇaṁ 1:
silibiga nī sedulu aṇuvaṇuvu taḍumuduṁṭe
mohabu tĕraliga tŏligenā...ahā..ahā..aha
sali sali siru gālulu giligiṁta rebuduṁṭe
āśhala allari aṇigenā..ahā..ahā..ahā
padāladone variṁchanā
sarāga mālai tariṁchanā
svarāladone spṛśhiṁchanā
sukhāla vīṇa śhṛtiṁchanā
ā vĕnnĕla nī kannula
rebĕkkina ā koriga
pŏgalai sĕgalai yĕdalo ragilina kṣhaṇame....e..e..e
sĕppagane..sĕppagane..
sĕppagane sĕbudunnavi yide yide premani
sĕppagane sĕbudunnavi yide yide premani
saraṇaṁ 2:
tanuvunu pĕnavesina nī sīragĕṁta garvaṁ
yavvana girulanu taḍimĕnanā
nī kaugiḍa naliginaṁduge aṁta garvaṁ
madanuḍi malubulu tĕlisĕnanī
tĕllāranīge ŏyyāramā
allāḍiboye yī reyini
savālu sese śhṛṁgāramā
saṁdhiṁchamāge o hāyini
ā mallĕla keriṁtalu
nī navvula lāliṁtalu
valalai alalai ŏḍilo ŏdigina kṣhaṇame
sĕppagane..sĕppagane..
sĕppagane sĕbudunnavi yide yide premani
sĕppagane sĕbudunnavi yide yide premani