Seliyaa seliyaa telusaa kalale kalalai migila&

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిల&
Work
Year
Language

పల్లవి:

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై
కనుల నీరే నదులై

ప్రియురాలా కనవా నా ఆవేదన
ప్రియమారా వినవా ఈ ఆలాపన
వలపే విషమా మగాతే చలమా
ప్రణయమా

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై
కనుల నీరే నదులై

చరణం 1:

ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు
ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు
వినపడుతున్నవి నా మదికి చెలి
జిలిబిలి పలుకుల గుసగుసలు
కనబడుతున్నవి కన్నులకి
నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు
ఇరువురి ఎద సడి ముగిసినదా
కలవరమున చెర బిగిసినదా
చెలియా చెలియా దరి రావా
సఖియా సఖియా జత కావా
ఓ..ఓ..ఓ..ఊ ఊ ఊ..
రెప్పల మాటున ఉప్పెన
రేపిన మేఘం ఈ ప్రేమ

చరణం 2:

గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు
కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు
జననం ఒకటే తెలుసు మరి
తన మరణం అన్నది ఎరుగదది..
కాదని కత్తులు దూస్తున్నా
మమకారం మాత్రం మరువదది..
చరితలు తెలిపిన సత్యమిదే..
అంతిమ విజయం ప్రేమలదే..
చెలియా చెలిమే విడువకుమా
గెలిచేదోకటే ప్రేమ సుమా..
ఓ..ఓ..ఓ...ఊ ఊ ఊ ఊ..
గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ..

pallavi:

sĕliyā sĕliyā tĕlusā kalale kalalai migile
madilo digule ragile
sakhiyā manase alusā kalise dāre karuvai
kanula nīre nadulai

priyurālā kanavā nā āvedana
priyamārā vinavā ī ālābana
valabe viṣhamā magāde salamā
praṇayamā

sĕliyā sĕliyā tĕlusā kalale kalalai migile
madilo digule ragile
sakhiyā manase alusā kalise dāre karuvai
kanula nīre nadulai

saraṇaṁ 1:

ĕdalo ŏdige ĕdane ĕduḍe dāsiṁdĕvaru
āśhai ĕgase alane māyaṁ sesiṁdĕvaru
vinabaḍudunnavi nā madigi sĕli
jilibili palugula gusagusalu
kanabaḍudunnavi kannulagi
nina mŏnnala mĕrisina priya layalu
iruvuri ĕda saḍi mugisinadā
kalavaramuna sĕra bigisinadā
sĕliyā sĕliyā dari rāvā
sakhiyā sakhiyā jada kāvā
o..o..o..ū ū ū..
rĕppala māḍuna uppĕna
rebina meghaṁ ī prema

saraṇaṁ 2:

gadame sĕribedĕvaru digule ābedĕvaru
kabure tĕlibedĕvaru valabe nilibedĕvaru
jananaṁ ŏgaḍe tĕlusu mari
tana maraṇaṁ annadi ĕrugadadi..
kādani kattulu dūstunnā
mamagāraṁ mātraṁ maruvadadi..
saridalu tĕlibina satyamide..
aṁtima vijayaṁ premalade..
sĕliyā sĕlime viḍuvagumā
gĕlisedogaḍe prema sumā..
o..o..o...ū ū ū ū..
guṁḍĕla guḍilo āraga vĕlige dībaṁ ī prema..