Title (Indic)సమయానికి తగుసేవలు సేయనీ నీ శ్రీవారి WorkSeedayya Year2000 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Suneeda Performer Vijay Yesudas Writer Samdrabos LyricsTeluguపల్లవి: సమయానికి తగుసేవలు సేయనీ నీ శ్రీవారినీ సమయానికి తగుసేవలు సేయనీ నీ శ్రీవారినీ ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ..ఇక సేవించనీ ఈ శ్రీవారినీ చరణం 1: నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో .. శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగల మించు బాహు బంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో .. అర్ధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో.. నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో .. నా పాపకు జరిగేను నైవేద్యసేవ .. నైవేద్యసేవ ! చరణం 2: కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో చెడుచేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో .. ఈ కాంతకు జరిగేను ఏకాంతసేవ అనుబంధమె బంధువై మమతలె ముత్తయిదువలై ఆనందబాష్పాలె అనుకోని అతిథులై .. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజామర విసిరేటి గాలితో .. చూలాలికి జరిగేను జోలాలి సేవ .. జోజోలాలి సేవ ! చరణం 3: శ్రీవారికి ఒక మనవిని సేయనీ.. ఈ ప్రియదాసినీ శ్రీవారికి ఒక మనవిని సేయనీ ఈ ప్రియదాసినీ కనుతెరవగ మీ రూపే చూడాలని... మీ కౌగిళ్లలో కనుమూయాలని... ఈ కౌగిళ్లలో కలిసుండాలని... !!!!!!!!!!!! Englishpallavi: samayānigi tagusevalu seyanī nī śhrīvārinī samayānigi tagusevalu seyanī nī śhrīvārinī innāḽḽugā śhramiyiṁchina illālini ..iga seviṁchanī ī śhrīvārinī saraṇaṁ 1: nāgu nuvvu nīgu nenu anna tībi māḍado sĕvilona gusagusala silibi valabu pāḍado .. śhrīmadigi jarigenu suprabhāda seva baṁgāru nagala miṁchu bāhu baṁdhālado saluva saṁdanāla miṁchu sallani nā sūbudo .. ardhāṁgigi jarigenu alaṁkāra seva ammaloni bujjagiṁpu kalibina ī buvvado.. nānnaloni ūraḍiṁpu tĕlisina ī sedido .. nā pābagu jarigenu naivedyaseva .. naivedyaseva ! saraṇaṁ 2: kaladaleni logaṁlo diṣhṭibaḍani dīvilo sĕḍuserani soḍulo praśhāṁta parṇaśhālalo .. ī kāṁtagu jarigenu egāṁtaseva anubaṁdhamĕ baṁdhuvai mamadalĕ muttayiduvalai ānaṁdabāṣhpālĕ anugoni adithulai .. sīdammagu jarigenu sīmaṁtabu seva nulivĕchchani nā ĕdabai pariseḍi pānpulo kanurĕppala viṁjāmara visireḍi gālido .. sūlāligi jarigenu jolāli seva .. jojolāli seva ! saraṇaṁ 3: śhrīvārigi ŏga manavini seyanī.. ī priyadāsinī śhrīvārigi ŏga manavini seyanī ī priyadāsinī kanudĕravaga mī rūbe sūḍālani... mī kaugiḽlalo kanumūyālani... ī kaugiḽlalo kalisuṁḍālani... !!!!!!!!!!!!