చేతిలోన చేయ్యేసి చెప్పేయవా
పల్లవి:
చేతిలోన చేయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ…ఆ
చరణం 1:
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై కనే కలేవెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం….ఆ….
చరణం 2:
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలుచూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం
pallavi:
sedilona seyyesi sĕppeyavā
nanu ĕnnaḍū viḍibonani
premamīda ŏṭṭesi sĕppeyavā
nanu vīḍani jada nīvani
pradikṣhaṇaṁ premalo parīkṣhale vachchinā
talarādagu talavaṁchadu prema…ā
saraṇaṁ 1:
nīvu nenule manassu ŏkkaḍe
iddaraina ī mamagāraṁlo
nīvu nenane padālu levule
egamaina ī priyamaṁtraṁlo
nā guṁḍĕlo kogila nī gŏṁtulo pāḍagā
nā janma o pūvulā nī kŏmmalo pūyagā
kala ilā kaugilai kane kalevĕnnĕlai
seyi kalibina sĕlime anurāgaṁ….ā….
saraṇaṁ 2:
ninnudāgide devadārsana
pūjalaṁdugo pulagiṁtallo
vālusūbule varāla dīvĕna
nannu dāsugo kanubāballo
nā prema gīdānigi nīvele tŏli akṣharaṁ
nā prema puṭṭiṁṭigi nīvele dībāṁkuraṁ
rasānigo rāgamai rasiṁchani kāvyamai
seyi kalibina salave anubaṁdhaṁ