Title (Indic)నువ్వంటే నాకిష్టమని అన్నది WorkSantosham Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Usha Performer Raajesh Writer Usha LyricsTeluguపల్లవి: నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ చరణం 1: నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నలుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా చరణం 2: ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా Englishpallavi: nuvvaṁṭe nāgiṣhṭamani annadi nā pradi śhvāsa nuvvele nālogamani annadi nā pradi āśha nī navvulo śhṛti kalibi pāḍaga nī nīḍalo aṇuvaṇuvu āḍaga anurāgaṁ paligiṁdi saṁtoṣhaṁ svarāluga saraṇaṁ 1: nuvvu nā vĕṁṭa uṁṭe aḍugaḍuguna naḍubuduṁṭe ĕduraye nā pradi kala nijamallĕ kanibiṁchadā ninnilā sūstu uṁṭe maimarabu nannaluduṁṭe kanabaḍe nijame ilā kalalāga anibiṁchadā varālanni sūḍiga ilā nannu seragā sudūrāla tāraga samībāna vālagā leneledu iṁke korigā saraṇaṁ 2: āgibovāli kālaṁ mana sŏṁtamai ĕllagālaṁ ninnaga sana sannaga sejāribonīyagā sūḍu nā iṁdrajālaṁ vĕnudirigi vastuṁdi kālaṁ rebuga mana pābaga puḍuduṁdi sarigŏttagā nīvu nāgu toḍugā nenu nīgu nīḍagā pradi reyi tīyagā pilustoṁdi hāyigā ilā uṁḍibode sālugā