Title (Indic)దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్ WorkSantosham Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Usha Performer Kege Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే చరణం 1: వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడూ ముందరెప్పుడూ చూడలేదిలా దీని వాలకం ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం చరణం 2: కోయిలా నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది చీటికీ మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంతే ఉంటుందమ్మా ప్రేమా అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే Englishpallavi: devuḍe digi vachchinā svargame nāgichchinā ṣhājahān dirigŏchchinā tājmahal rāsichchinā ippuḍī saṁtoṣhaṁ muṁdara sinnabodāyi annī kadarā lolona manasaṁtā saṁtoṣhame ī prema pulagiṁta saṁtoṣhame lolona manasaṁtā saṁtoṣhame ī prema pulagiṁta saṁtoṣhame saraṇaṁ 1: vĕnnĕlā sūḍu nannilā ĕṁta hāyigā uṁdi ī dinaṁ nammavā nannu nammavā sedigaṁdudū uṁdi āgasaṁ ippuḍe puṭṭinaṭṭugā ĕṁta bujjigā uṁdi bhūdalaṁ ĕppuḍū muṁdarĕppuḍū sūḍaledilā dīni vālagaṁ premŏste iṁtenemo pābaṁ dāsohaṁ aṁṭuṁdemo vaṁgi vaṁgi ī logaṁ saraṇaṁ 2: koyilā nersugo ilā āmĕ navvulo tenĕ saṁtagaṁ hāyigā pīlsugo ilā salla gālilo āmĕ parimaḽaṁ nīḍibai saṁdamāmalā neḍu teludū uṁdi nā madi sīḍigī māḍi māḍigī kŏtta kŏttagā uṁdi emadi aṇuvaṁte uṁṭuṁdammā premā aṇasāli anugunnāmā sestuṁdammā haṁgāmā devuḍe digi vachchinā svargame nāgichchinā ṣhājahān dirigŏchchinā tājmahal rāsichchinā ippuḍī saṁtoṣhaṁ muṁdara sinnabodāyi annī kadarā lolona manasaṁtā saṁtoṣhame ī prema pulagiṁta saṁtoṣhame lolona manasaṁtā saṁtoṣhame ī prema pulagiṁta saṁtoṣhame