పల్లవి:
చందమామా.. చందమామా..
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా.. జంటే రామ్మా..
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
No No.. ఒకసారిటు చూడు
No No.. నీ సొమ్మేం పోదు
No No.. ముద్దంటే చేదా ఆ ఆ
No No.. నాతో మాటాడు ..
No No.. పోనీ పోటాడు
No No.. సరదా పడరాదా దా..దా .దా ..దా
చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
చరణం 1:
వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో.. కల్లో..
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో.. పిల్లో
కల్లో అయితే సర్లే గాని తల్లో.. తల్లో..
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో.. పిల్లో
దేఖోనా.. సిగ్గును కొద్దిగా సైడుకి నెట్టా..ఓకేనా ఏం బాగాలేనా ..
దాగేనా.. కొంగుకు లొంగని సంగతులెన్నో..చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా ..No.. No..
ఇంత చెప్పినా డౌటేనా.. Na Na Na Naa.
ఇల్లారా.. కళ్ళారా.. చూస్తావా ..ఇంకా..ఎన్నో.. ఎన్నో.. ఎన్నో..
హెయ్ చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
చరణం 2:
కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా.. దానా..
నీలో చాలా విద్యే ఉందే జాణా.. జాణా
గుమ్మం లోనే ముగ్గై ఉన్నా నిన్నా.. నిన్నా..
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా.. తున్నా..
చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో..విన్నాలే శృంగార వీణా
తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే..కానిలే నే కాదన్నానా
ఊపిరాదడే నీ ఒళ్ళో ..No.. No..
ఉండిపోకలా దూరం లో .. No.. No..
ముస్తాబై వచ్చేవా.. ముద్దిచ్చే ఉద్దేశంతో..ఆహా.. ఆహా.. ఆహా..
చందమామా.. చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా.. జంటే రామ్మా..
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా