Sakkani sukka sarasagu raave

చక్కని చుక్క సరసకు రావే
Year
Language

పల్లవి:

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ...

చరణం 1:

అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు ||2||
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా ||2||
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము

//టక్కరి బావ//

చరణం 2:

ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే ||2||
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా ||2||
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే

//చక్కని చుక్క//

చరణం 3:

నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు ||2||
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా ||2||
చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము ||2||

టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ...
చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...

pallavi:

sakkani sukka sarasagu rāve ŏkkasāri navvina sāle
ukkiri bikkiri ayibodāne... e... e... e...
ṭakkari bāva kikkuru managu ikkaḍi māḍa
idarulu viṁṭe ukkiri bikkiri ayibodāve... e... e... e...

saraṇaṁ 1:

allari pillā ābavelā pullavirubu māḍalu ||2||
pĕḽḽāṁ kanabaḍide preme kaligiṁdā ||2||
pĕḽḽāmaṁṭe bĕllamu tallidaṁḍri allamu

//ṭakkari bāva//

saraṇaṁ 2:

muddula gumma mohamāye pŏddu sālā poyĕne ||2||
pĕddalu garjiste pĕḍasaramavudāvā ||2||
pĕddala gŏḍava ĕṁduge iddaramŏgaḍai uṁdāme

//sakkani sukka//

saraṇaṁ 3:

nāyanagāri mīsamū sūstene sanyāsamu
mī nāyanagāri mīsamū sūstene sanyāsamu
abbā abbabba nī māḍalu kŏraḍādĕbbalu ||2||
sūḍigā pĕḽḽāḍi sāḍuga rānelā ||2||
seyagu nannu dūramu tīyagu mī nā prāṇamu ||2||

ṭakkari bāva kikkuru managu ikkaḍi māḍa
idarulu viṁṭe ukkiri bikkiri ayibodāve... e... e... e...
sakkani sukka sarasagu rāve ŏkkasāri navvina sāle
ukkiri bikkiri ayibodāne... e... e... e...