Sakkanaina o sirugaali

చక్కనైన ఓ చిరుగాలి
Year
Language

పల్లవి:

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్కమాట వినిపోవాలి !!2!!

ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి
అందించాలి
నా ప్రేమ సందేశం...

చరణం 1:

మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నా హృదయం
కరువైపోయే ఆనందం
అనురాగమీవేళ అయిపోయే చెరసాల !!2!!
అయిపోయె చెరసాల

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి
అందించాలి
నా ప్రేమ సందేశం...

చరణం 2:

నా ప్రేమ రాగాలు కలలాయె
కన్నీటి కథలన్ని బరువాయే
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం
వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను !!2!!
శోకములు తీరేను...

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి
అందించాలి
నా ప్రేమ సందేశం...

pallavi:

sakkanaina o sirugāli
ŏkkamāḍa vinibovāli !!2!!

uṣhā dūramaina nenu
ūbiraina tīyalenu
gāli sirugāli sĕli sĕṁtagu vĕḽḽi
aṁdiṁchāli
nā prema saṁdeśhaṁ...

saraṇaṁ 1:

mūsāru guḍiloni talubulanu
ābāru guṁḍĕllo pūjalanu
dāriledu sūḍālaṁṭe devadanu
vīlugādu sĕppālaṁṭe vedananu
kaladaiboye nā hṛdayaṁ
karuvaiboye ānaṁdaṁ
anurāgamīveḽa ayiboye sĕrasāla !!2!!
ayiboyĕ sĕrasāla

gāli sirugāli sĕli sĕṁtagu vĕḽḽi
aṁdiṁchāli
nā prema saṁdeśhaṁ...

saraṇaṁ 2:

nā prema rāgālu kalalāyĕ
kannīḍi kathalanni baruvāye
mabbu vĕnaga saṁdamāma dāgi unnado
manasu vĕnuga āśhalanni dāsugunnado
vedanalela ī samayaṁ
vĕluduru nīde rebudayaṁ
śhodhanalu āgenu śhogamulu tīrenu !!2!!
śhogamulu tīrenu...

gāli sirugāli sĕli sĕṁtagu vĕḽḽi
aṁdiṁchāli
nā prema saṁdeśhaṁ...