పల్లవి:
సాహసమే చేయ్రా డింభకా..అన్నది కదరా పాతాళభైరవీ
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే...అహహహా....దక్కుతుందీ...అహహహా...రాకుమారీ
తెలివిగా వెయ్రా పాచిక కల్లో మేనకా ఒళ్లో పడదా
సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా...అహహహా.....నిచ్చెనేద్దాం...అహహహహా....ఎక్కిచూద్దాం
అహహహా ఒహోహో..
చరణం 1:
చందమామను అందుకుని ఇంద్రభవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా
సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా
అపుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా
చిటికేస్తే అహహహా సుఖమంతా....అహహహా..మనదేరా
చరణం 2:
సున్ని ఉండలు కందిపొడీ ప్యాక్టరీలోన వండించనీ
అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారనీ
కొన్ని ఎం.పిలను కొంటా కొత్త పి.ఎం ను నేనేనంటా
స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే..అహహహా...ఎవడైనా...అహహహా...సూపర్ స్టారే
pallavi:
sāhasame seyrā ḍiṁbhagā..annadi kadarā pādāḽabhairavī
sŏravagā dūgagabode sādhiṁchalevurā nuvvanugunnadi
dhairyamuṁṭe...ahahahā....dakkuduṁdī...ahahahā...rāgumārī
tĕlivigā vĕyrā pāsiga kallo menagā ŏḽlo paḍadā
suluvugā rādura kuṁka baṁgāru jiṁka veḍāḍāligā
niṁgidāgā...ahahahā.....nichchĕneddāṁ...ahahahahā....ĕkkisūddāṁ
ahahahā ŏhoho..
saraṇaṁ 1:
saṁdamāmanu aṁduguni iṁdrabhavanānni kaḍadānurā
paḍavaṁta kārulona bajārulanni ṣhigāru sestānurā
sŏṁtamaina vimānamulo svargalogānni suḍadānurā
abuḍu apsarasalu ĕduru vachchi kannu kŏḍadārurā
siḍigeste ahahahā sukhamaṁtā....ahahahā..manaderā
saraṇaṁ 2:
sunni uṁḍalu kaṁdibŏḍī pyākṭarīlona vaṁḍiṁchanī
amĕrigā irānu jabān irāgu janālu tiṁṭāranī
kŏnni ĕṁ.pilanu kŏṁṭā kŏtta pi.ĕṁ nu nenenaṁṭā
skāmulĕnno sesi svis byāṁkugesi ḍālarlalo teludā
suḍi uṁṭe..ahahahā...ĕvaḍainā...ahahahā...sūbar sṭāre