Ramdi ramdi kadaliramdi..niduralemdi.

రండి రండి కదలిరండి..నిదురలెండి.
Work
Year
Language

పల్లవి:

రండి కదలిరండి నిదురలెండి కలసిరండి-
ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉరికి రండి.

గనులనుండి పనులనుండి కణకణాగ్ని శిఖలనుండి -
చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధలనుండి

నివుర దీసి నిదురలేచి ఈనాటికి నిప్పురవ్వ -
ఎవరైనా యముడైనా చెల్లని ఓ చిల్లిగవ్వ

చరణం 1:

మన రక్తం కొల్లగొట్టి - మననెత్తిన చేతులెట్టి-
మానులుగా ఎదుగుతున్న - యజమానుల కొమ్ముకొట్టి ||2||

బొగ్గులలో దాగివున్న అగ్గులనే రెచ్చగొట్టి
రాబందుల కామందుల రాజ్యానికి గండికొట్టి
తరతరాల బానిసత్వ చెరలనుండి తరలిరండి
మనమంతా కార్మికులం- మనదంతా ఒకే కులం

మన స్వేదం మన వేదం - మన శక్తి భవితవ్యం

చరణం 2:

పొరలే ఈ అశ్రుకణం మన పాలీట అగ్నికణం
గ్రహమేది ఆపలేని సత్యాగ్రహమీ సమరం ||2||

కందకాల కంధకార మబ్బుతున్న లేత నిజం
పగబట్టిన నిట్టూర్పుల సెగకాదు ఫ్యూడలిజం
పలుగుబట్టి పారబట్టి పరుశరాములై పదండి.

మన ధ్యేయం కాంతిమయం మనమార్గం క్రాంతియుతం
మన జీవం గాండీవం మన ప్రాణం పాశుపతం

రండి కదలిరండి నిదురలెండి కలసిరండి-
ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉరికి రండి.

గనులనుండి పనులనుండి కణకణాగ్ని శిఖలనుండి -
చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధలనుండి

నిదుర లేచె భారాతాన ఈనాటికి మరో దండి
అన్నమాట తెలిసిరండి కదనానికి కలసిరండి

!

pallavi:

raṁḍi kadaliraṁḍi niduralĕṁḍi kalasiraṁḍi-
uppĕnalā urigi raṁḍi udyamamai urigi raṁḍi.

ganulanuṁḍi panulanuṁḍi kaṇagaṇāgni śhikhalanuṁḍi -
sĕmaḍoḍchina śhramajīvula samajīvula vyadhalanuṁḍi

nivura dīsi niduralesi īnāḍigi nippuravva -
ĕvarainā yamuḍainā sĕllani o silligavva

saraṇaṁ 1:

mana raktaṁ kŏllagŏṭṭi - mananĕttina sedulĕṭṭi-
mānulugā ĕdugudunna - yajamānula kŏmmugŏṭṭi ||2||

bŏggulalo dāgivunna aggulane rĕchchagŏṭṭi
rābaṁdula kāmaṁdula rājyānigi gaṁḍigŏṭṭi
taradarāla bānisatva sĕralanuṁḍi taraliraṁḍi
manamaṁtā kārmigulaṁ- manadaṁtā ŏge kulaṁ

mana svedaṁ mana vedaṁ - mana śhakti bhavidavyaṁ

saraṇaṁ 2:

pŏrale ī aśhrugaṇaṁ mana pālīḍa agnigaṇaṁ
grahamedi ābaleni satyāgrahamī samaraṁ ||2||

kaṁdagāla kaṁdhagāra mabbudunna leda nijaṁ
pagabaṭṭina niṭṭūrbula sĕgagādu phyūḍalijaṁ
palugubaṭṭi pārabaṭṭi paruśharāmulai padaṁḍi.

mana dhyeyaṁ kāṁtimayaṁ manamārgaṁ krāṁtiyudaṁ
mana jīvaṁ gāṁḍīvaṁ mana prāṇaṁ pāśhubadaṁ

raṁḍi kadaliraṁḍi niduralĕṁḍi kalasiraṁḍi-
uppĕnalā urigi raṁḍi udyamamai urigi raṁḍi.

ganulanuṁḍi panulanuṁḍi kaṇagaṇāgni śhikhalanuṁḍi -
sĕmaḍoḍchina śhramajīvula samajīvula vyadhalanuṁḍi

nidura lesĕ bhārādāna īnāḍigi maro daṁḍi
annamāḍa tĕlisiraṁḍi kadanānigi kalasiraṁḍi

!