Title (Indic)జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏన& WorkRaj Kumar Year1983 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది ఆ రామాయణం... మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చరణం 1: చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది వలపు స్వయం వరమైనపుడు గెలువనిది ఏది ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి తొలి చుక్కవు నీవే చుక్కాణివి నీవే తుదిదాకా నీవే మరు జన్మకు నీవే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జానకి కలగనలేదు|| చరణం 2: సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం గతమంటే నీవే కధకానిది నీవే కలలన్ని నావే కలకాలం నీవే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాముడు అనుకోలేదు || Englishpallavi: jānagi kalaganaledu rāmuni sadi kāgalanani enāḍu rāmuḍu anugoledu jānagi padi kāgalanani ānāḍu ānāḍu ĕvarū anugonidi ināḍu managu nijamainadi ā rāmāyaṇaṁ... mana jīvana pārāyaṇaṁ rāmuḍu anugoledu jānagi padi kāgalanani ānāḍu saraṇaṁ 1: sĕlimanase śhivadhanassu ayinadi tŏlisūbula vaśhamainadi valabu svayaṁ varamainabuḍu gĕluvanidi edi ŏga bāṇaṁ ŏga bhāryannadi śhrīrāmuni sirayaśhamainadi śhrīvāru ā varamiste sirulanni nāvi tŏli sukkavu nīve sukkāṇivi nīve tudidāgā nīve maru janmagu nīve ā ā ā ā ā ā ā jānagi kalaganaledu|| saraṇaṁ 2: sahavāsaṁ managu nivāsaṁ sarihaddu nīlāgāśhaṁ pradibŏddu praṇayāveśhaṁ pĕdavulabai hāsaṁ sumasāraṁ mana saṁsāraṁ maṇihāraṁ mana mamagāraṁ pradiroju ŏga śhrīgāraṁ paravaśha śhṛṁgāraṁ gadamaṁṭe nīve kadhagānidi nīve kalalanni nāve kalagālaṁ nīve ā ā ā ā ā ā ā rāmuḍu anugoledu ||