పల్లవి:
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేలా
చరణం 1:
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన.....పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని
ఎదలలోని సొదలుమాని || రాసలీలవేళ ||
చరణం 2:
మాయజేసి దాయకు
సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి...పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను
కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు
చలువ సోకి నిలువ నీదు || రాసలీలవేళ ||
pallavi:
rāsalīlaveḽa rāyabāramela
māḍe maunamai māyajeyanelā
rāsalīlaveḽa rāyabāramelā
saraṇaṁ 1:
kaugiliṁta veḍilo karige vannĕ vĕnnalā
tĕllaboyi vesavi sallĕ pagaḍi vĕnnĕla
mojulannī pāḍagā jājibūla jāvaḽi
kaṁdĕnemo kaugiḍa aṁdamaina jābili
tenĕvānalona silige tīyanaina snehamu
meni vīṇalona.....palige soyagāla rāgamu
nidurarāni kuduruleni
ĕdalaloni sŏdalumāni || rāsalīlaveḽa ||
saraṇaṁ 2:
māyajesi dāyagu
soyagāla mallĕlu
moyaleni tīyani hāyi...pūla jallulu
seradīsi pĕṁchagu bhāramaina yavvanaṁ
dorasiggu tuṁchagu ūrugodu ī kṣhaṇaṁ
sebagaḽḽa sāgarāla alala ūyalūganā
sūbu muḽḽu obalenu
kalala talubu tīyanā
sĕluva sogu kaluva regu
saluva sogi niluva nīdu || rāsalīlaveḽa ||