Raaniraanamma..anaadi navvulu evamma

రాణిరాణమ్మ..అనాటి నవ్వులు ఏవమ్మ
Year
Language

పల్లవి:

రాణిరాణమ్మ ...అనాటి నవ్వులు ఏవమ్మ
రాణిరాణమ్మ ...అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని... నీ ముంగిట ఆడాలని
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో...ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణిరాణమ్మ... అనాటి నవ్వులు ఏవమ్మ

చరణం 1:

రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని

ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను?
ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను?
పన్నీటి బతుకులోన... కన్నీటి మంటలేనా?

రాణిరాణమ్మ ...అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని... నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో... ఎగిరెగిరి వచ్చానమ్మ

రాణీరాణమ్మ... రాణీ కన్నీళ్లు రానీయమ్మా
రాణీరాణమ్మ... రాణీ కన్నీళ్లు రానీయమ్మా
సహనం స్త్రీకి కవచమని... శాంతం అందుకు సాక్షమని
సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్షమని
ఉన్నాను మౌనంగా.. కన్నులు దాటని కన్నీరుగా

రాణీరాణమ్మ... రాణీ కన్నీళ్లు రానీయమ్మా

చరణం 2:

గుండె రగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే
గుండె రగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే

ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే... విధిరాత తప్పదులే

రాణిరాణమ్మ... అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని ...నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో... ఎగిరెగిరి... వచ్చానమ్మ
రాణిరాణమ్మ.... అనాటి నవ్వులు ఏవమ్మ

pallavi:

rāṇirāṇamma ...anāḍi navvulu evamma
rāṇirāṇamma ...anāḍi navvulu evamma
nī veḍuga sūḍālani... nī muṁgiḍa āḍālani
nī veḍuga sūḍālani nī muṁgiḍa āḍālani
ennĕnni āśhalado...ĕgirĕgiri vachchānamma
rāṇirāṇamma... anāḍi navvulu evamma

saraṇaṁ 1:

radanālameḍalona... ninnŏga rāṇiga sūḍālani
nī aḍugulu kaṁdaguṁḍā... nā ariseduluṁchālani
radanālameḍalona... ninnŏga rāṇiga sūḍālani
nī aḍugulu kaṁdaguṁḍā... nā ariseduluṁchālani

ĕṁtagā anugunnānu ...emiḍi sūstunnānu?
ĕṁtagā anugunnānu... emiḍi sūstunnānu?
pannīḍi badugulona... kannīḍi maṁṭalenā?

rāṇirāṇamma ...anāḍi navvulu evamma
nī veḍuga sūḍālani... nī muṁgiḍa āḍālani
ennĕnni āśhalado... ĕgirĕgiri vachchānamma

rāṇīrāṇamma... rāṇī kannīḽlu rānīyammā
rāṇīrāṇamma... rāṇī kannīḽlu rānīyammā
sahanaṁ strīgi kavasamani... śhāṁtaṁ aṁdugu sākṣhamani
sahanaṁ strīgi kavasamani śhāṁtaṁ aṁdugu sākṣhamani
unnānu maunaṁgā.. kannulu dāḍani kannīrugā

rāṇīrāṇamma... rāṇī kannīḽlu rānīyammā

saraṇaṁ 2:

guṁḍĕ ragilibodūvuṁṭe... gūḍumeḍa ŏgaḍele
kāḽḽu baṁḍabāribode... muḽḽu pūlu ŏgaḍele
guṁḍĕ ragilibodūvuṁṭe... gūḍumeḍa ŏgaḍele
kāḽḽu baṁḍabāribode... muḽḽu pūlu ŏgaḍele

ĕdurugā pŏṁge saṁdraṁ... ĕkkaḍo āvalidīraṁ
ĕdurugā pŏṁge saṁdraṁ... ĕkkaḍo āvalidīraṁ
ĕdurīda āgadule... vidhirāda tappadule

rāṇirāṇamma... anāḍi navvulu evamma
nī veḍuga sūḍālani ...nī muṁgiḍa āḍālani
ennĕnni āśhalado... ĕgirĕgiri... vachchānamma
rāṇirāṇamma.... anāḍi navvulu evamma