పల్లవి:
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా మూగకళ్ళ తేనె దీపాలా
గంగూలి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగుదురా మేఘమాల
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
చరణం 1:
గోపెమ్మో గువ్వాలేని గూడు కాకెమ్మో
కృష్ణయ్యో పూవ్వే నాదే పూచే నీదయ్యో
దొంగలించుకున్న సొత్తు గోవింద
ఆవలించకుంటె నిద్దరౌతుందా
ఉట్టికొట్టే వేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
చరణం 2:
ఓలమ్మో చోళిలోన షోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రిగాలి పాటేలే
అది వెన్నదోచుకున్న మిన్ను చాటేలే
జట్టేకడితే జంట రావమ్మో పట్టువిడుపు ఉంటే మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా మూగకళ్ళ తేనె దీపాలా
గంగూలి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల