Raaliboye puvvaa neegu raagaalemduge

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
Year
Language

పల్లవి:

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా.... కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం..

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే

చరణం 1:

చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా...
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......
తనవాడు తారల్లో చేరగా... మనసు మాంగళ్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హరతివై ..

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే...

చరణం 2:

అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే...
పగిలే ఆకాశం నీవై... జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీణియవై...

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే..

pallavi:

rāliboyĕ puvvā nīgu rāgālĕṁduge toḍamāli nī toḍuleḍule
vāliboyĕ pŏddā nīgu varṇālĕṁduge logamĕnnaḍo sīgaḍāyĕle
nīgidi tĕlavārani reyammā.... kaligī mā silagā pāḍagu ninnaḍi nī rāgaṁ..

rāliboyĕ puvvā nīgu rāgālĕṁduge.. toḍamāli nī toḍuleḍule
vāliboyĕ pŏddā nīgu varṇālĕṁduge... logamĕnnaḍo sīgaḍāyĕle

saraṇaṁ 1:

sĕdiriṁdi nī gūḍu gāligā silagā goriṁkamma gādhagā...
sinnāri rūbālu kannīḍi dībālu kāgā......
tanavāḍu tārallo seragā... manasu māṁgaḽyālu jāragā..
siṁdhūra varṇālu tĕllāri sallāri pogā...
tirige bhūmādavu nīvai veguvalo vĕnnĕlavai
karige karbūramu nīvai āśhalage haradivai ..

rāliboyĕ puvvā nīgu rāgālĕṁduge.. toḍamāli nī toḍuleḍule
vāliboyĕ pŏddā nīgu varṇālĕṁduge... logamĕnnaḍo sīgaḍāyĕle...

saraṇaṁ 2:

anubaṁdhamaṁṭenĕ appule karige baṁdhālannī mabbule
hemaṁta rāgala semaṁtule vāḍiboye...
tana raṁgu mārsiṁdi raktame tanado rālenaṁdi pāśhame
dībāla paṁḍakki dībālĕ kŏṁḍĕkki pŏye...
pagile āgāśhaṁ nīvai... jāribaḍe jābilivai
migile ālābana nīvai... tīga tĕge vīṇiyavai...

rāliboyĕ puvvā nīgu rāgālĕṁduge.. toḍamāli nī toḍuleḍule
vāliboyĕ pŏddā nīgu varṇālĕṁduge... logamĕnnaḍo sīgaḍāyĕle..