పువ్వులనడుగు... నవ్వులనడుగు
పల్లవి:
పువ్వులనడుగు... నవ్వులనడుగు...
పువ్వులనడుగు నవ్వులనడుగు... రివ్వున ఎగిరే గువ్వలనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో... ఓ... ఓ...
కొమ్మలనడుగు... ఆఁహాఁహాఁహాఁ... రెమ్మలనడుగు ఆఁహాఁహాఁహాఁ...
కొమ్మలనడుగు రెమ్మలనడుగు... ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో...
చరణం 1:
పల్లె పదానికి పల్లవినై...ఈ..
పడుచందానికి పల్లకినై...ఈ..
పెదవి పల్లవి కలిపేస్తా...
నా పల్లవి నీలో పలికిస్తా...ఆ..
నీవు నేనుగా పూవు తావిగా....
జన్మ జన్మలకు విడని జంటగా...
నీవే.. నా దీవెనా... ఆ..ఆ..
ఈ పొద్దు చాలక నా ముద్దు తీరగ
రేపన్నదేలేక చెలరేగిపోతా....
పువ్వులనడుగు...
పువ్వులనడుగు నవ్వులనడుగు... రివ్వున ఎగిరే గువ్వలనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో...
చరణం 2:
పొడిచే పొద్దుల తూరుపునై...ఈ..ఈ..
వాలే పొద్దుల పడమరనై...ఈ..ఈ..
దిక్కులు నీలో కలిపేస్తా...ఆ..ఆ..
నా దిక్కువి నీవని పూజిస్తా..ఆ..ఆ..
నింగి సాక్షిగా నేల సాక్షిగా... మమతల మల్లెల మనస్సాక్షిగా...
నీవే నా దేవతా....
ఆ...ఆ...ఆ...
వెయ్యేళ్ల కోరిక నూరేళ్లు చాలక... ఏడేడు జన్మలు నీదాననౌతా...
కొమ్మలనడుగు...
కొమ్మలనడుగు రెమ్మలనడుగు... ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు...
నువ్వంటే... నువ్వంటే... నాకెంత ప్రేమో... ప్రేమో...
ఇది ఏనాటి అనుబంధమో...ఓ...
pallavi:
puvvulanaḍugu... navvulanaḍugu...
puvvulanaḍugu navvulanaḍugu... rivvuna ĕgire guvvalanaḍugu...
nuvvaṁṭe nāgĕṁta premo... idi enāḍi anubaṁdhamo... o... o...
kŏmmalanaḍugu... ām̐hām̐hām̐hām̐... rĕmmalanaḍugu ām̐hām̐hām̐hām̐...
kŏmmalanaḍugu rĕmmalanaḍugu... jhummani pāḍe tummĕdanaḍugu...
nuvvaṁṭe nāgĕṁta premo... idi enāḍi anubaṁdhamo...
saraṇaṁ 1:
pallĕ padānigi pallavinai...ī..
paḍusaṁdānigi pallaginai...ī..
pĕdavi pallavi kalibestā...
nā pallavi nīlo paligistā...ā..
nīvu nenugā pūvu tāvigā....
janma janmalagu viḍani jaṁṭagā...
nīve.. nā dīvĕnā... ā..ā..
ī pŏddu sālaga nā muddu tīraga
rebannadelega sĕlaregibodā....
puvvulanaḍugu...
puvvulanaḍugu navvulanaḍugu... rivvuna ĕgire guvvalanaḍugu...
nuvvaṁṭe nāgĕṁta premo... idi enāḍi anubaṁdhamo...
saraṇaṁ 2:
pŏḍise pŏddula tūrubunai...ī..ī..
vāle pŏddula paḍamaranai...ī..ī..
dikkulu nīlo kalibestā...ā..ā..
nā dikkuvi nīvani pūjistā..ā..ā..
niṁgi sākṣhigā nela sākṣhigā... mamadala mallĕla manassākṣhigā...
nīve nā devadā....
ā...ā...ā...
vĕyyeḽla koriga nūreḽlu sālaga... eḍeḍu janmalu nīdānanaudā...
kŏmmalanaḍugu...
kŏmmalanaḍugu rĕmmalanaḍugu... jhummani pāḍe tummĕdanaḍugu...
nuvvaṁṭe... nuvvaṁṭe... nāgĕṁta premo... premo...
idi enāḍi anubaṁdhamo...o...