Puttadi bommagu

పుత్తడి బొమ్మకు
Year
Language

పల్లవి:

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే....
పన్నీటి స్నానాలు చేసే వేళలో

నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో...

చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి...
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ

సరేనంటే రూపం తాపం సమర్పయామీ
నీ సన్నిధిలోనే సమస్తము..నివేగయామీ

చరణం 1:

కునుకుండదు కన్నులలోనా...కుదురుండదు గుండెలలో..
అణువణువు కోరుకుతున్నది...తియ్యని మైకం...

ఎదిగోచ్చిన వన్నెల వాన..ఒదిగుండదు వంపులలో
చెరనోదిలి ఉరుకుతున్నది ...వయసు వేగం

మనసుపడే కానుకా..అందించనా ప్రేమికా
దహించితే కోరికా...సహించకే గోపికా
అదిరేటి అధరాల ఆనా...
అందం చందం అన్ని నీకే...సమర్పయామి
ఆనందమంటే చూపిస్తాలే...చెలి ఫాలోమీ

పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ

చరణం 2:

నులివెచ్చని ముచ్చటలోన...తొలి ముద్దులు పుచ్చుకోనీ
సరిహద్దులు దాటవే...ఒంటరి కిన్నెరసాని

నును మెత్తని సోయగమంతా...సరికొత్తగ విచ్చుకోని
ఎదరొచ్చిన కాముని సేవకు...అంకితమవనీ

అవి ఇవి ఇమ్మనీ...అదే పనిగా వేడనీ
ఇహం పరం దువ్వనీ...పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ...
దేహం దేహం తాకే వేళ..సంతర్పయామీ
సందేహం మోహం తీరేవేళ...సంతోషయామీ

పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే
ముద్దులగుమ్మకు దిగులు పుట్టే..
పన్నీటి స్నానాలు చేసే వేళలో...

నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో...

చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి...
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ....

pallavi:

puttaḍi bŏmmagu sĕgalu suṭṭe
muddula gummagu digulubuṭṭe....
pannīḍi snānālu sese veḽalo

nunnani sĕṁpagu siggulu puṭṭe
annula minnagu allari pĕṭṭe..
kanarāni bāṇālu tāge veḽalo...

seyĕttudunnāṁ śhrīraṁgasāmī
seyūda sāyaṁgā aṁdiyyavemi
nā prema sāmrājyadevi...
puṣhpaṁ patraṁ snehaṁ dehaṁ samarbayāmī
nī kanyādānaṁ kābāḍagā nādele hāmī

sarenaṁṭe rūbaṁ tābaṁ samarbayāmī
nī sannidhilone samastamu..nivegayāmī

saraṇaṁ 1:

kunuguṁḍadu kannulalonā...kuduruṁḍadu guṁḍĕlalo..
aṇuvaṇuvu korugudunnadi...tiyyani maigaṁ...

ĕdigochchina vannĕla vāna..ŏdiguṁḍadu vaṁpulalo
sĕranodili urugudunnadi ...vayasu vegaṁ

manasubaḍe kānugā..aṁdiṁchanā premigā
dahiṁchide korigā...sahiṁchage gobigā
adireḍi adharāla ānā...
aṁdaṁ saṁdaṁ anni nīge...samarbayāmi
ānaṁdamaṁṭe sūbistāle...sĕli phālomī

puttaḍi bommagu sĕgalu suṭṭe
muddula gummagu digulu puṭṭe
puṣhpaṁ patraṁ snehaṁ dehaṁ samarbayāmī
nī kanyādānaṁ kābāḍagā nādele hāmī

saraṇaṁ 2:

nulivĕchchani muchchaḍalona...tŏli muddulu puchchugonī
sarihaddulu dāḍave...ŏṁṭari kinnĕrasāni

nunu mĕttani soyagamaṁtā...sarigŏttaga vichchugoni
ĕdarŏchchina kāmuni sevagu...aṁkidamavanī

avi ivi immanī...ade panigā veḍanī
ihaṁ paraṁ duvvanī...pade pade pāḍanī
tĕrasāḍu vivarālu annī...
dehaṁ dehaṁ tāge veḽa..saṁtarbayāmī
saṁdehaṁ mohaṁ tīreveḽa...saṁtoṣhayāmī

puttaḍi bŏmmagu sĕgalubuṭṭe
muddulagummagu digulu puṭṭe..
pannīḍi snānālu sese veḽalo...

nunnani sĕṁpagu siggulu puṭṭe
annula minnagu allari pĕṭṭe..
kanarāni bāṇālu tāge veḽalo...

seyĕttudunnāṁ śhrīraṁgasāmī
seyūda sāyaṁgā aṁdiyyavemi
nā prema sāmrājyadevi...
puṣhpaṁ patraṁ snehaṁ dehaṁ samarbayāmī
nī kanyādānaṁ kābāḍagā nādele hāmī....