Priyaa ..seliyaa ..pilise maunamaa

ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా
Year
Language

పల్లవి:

ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా ..
ఒడిలో తారలు కూర్చనా... సిగముడిలో జాబిలి చేర్చనా...
ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా

కలా ..నిజమా.. పలికే దైవమా
నా జీవన రేఖలోన మెరిసే సింధూరం నీవేనా
కలా.. నిజమా ..పలికే దైవమా

చరణం 1:

మలయసమీరుడు మనసై మలచిన మధుమయ శిల్పం నీవే
రాజ జగతికే రక్తిని చిలికే రసమయ రూపం నీవే
మదిలో వెన్నెల కురిసే మదనాలయ చంద్రదీపమా

ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా
నా జీవన రేఖలోన మెరిసే సింధూరం నీవేనా
కలా.. నిజమా ..పలికే దైవమా

చరణం 2:

మత్త కోకిలలు భ్రమర సారికలు మంగళ గీతాలు పాడగా
లతా పురంద్రులు జల్లిన పూలు తలంబ్రాలై దీవించగా
సర్వభూతముల సాక్షిగా గాందర్వ పరిణయం ఇదే సుమా

ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా
నా జీవన రేఖలోన మెరిసేటి సింధూరం నీవేనా
కలా.. నిజమా ..పలికే దైవమా
ఒదిలో తారలు కూర్చనా సిగముడిలో జాబిలి చేర్చనా
ప్రియా ..చెలియా ..పిలిచే మౌనమా

pallavi:

priyā ..sĕliyā ..pilise maunamā ..
ŏḍilo tāralu kūrsanā... sigamuḍilo jābili sersanā...
priyā ..sĕliyā ..pilise maunamā

kalā ..nijamā.. palige daivamā
nā jīvana rekhalona mĕrise siṁdhūraṁ nīvenā
kalā.. nijamā ..palige daivamā

saraṇaṁ 1:

malayasamīruḍu manasai malasina madhumaya śhilbaṁ nīve
rāja jagadige raktini silige rasamaya rūbaṁ nīve
madilo vĕnnĕla kurise madanālaya saṁdradībamā

priyā ..sĕliyā ..pilise maunamā
nā jīvana rekhalona mĕrise siṁdhūraṁ nīvenā
kalā.. nijamā ..palige daivamā

saraṇaṁ 2:

matta kogilalu bhramara sārigalu maṁgaḽa gīdālu pāḍagā
ladā puraṁdrulu jallina pūlu talaṁbrālai dīviṁchagā
sarvabhūdamula sākṣhigā gāṁdarva pariṇayaṁ ide sumā

priyā ..sĕliyā ..pilise maunamā
nā jīvana rekhalona mĕriseḍi siṁdhūraṁ nīvenā
kalā.. nijamā ..palige daivamā
ŏdilo tāralu kūrsanā sigamuḍilo jābili sersanā
priyā ..sĕliyā ..pilise maunamā