పల్లవి:
హే...హే...హే...హే..
ఓ...ఓ...ఓ...ఓ..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం
ఓ....ఓ...ఓ...ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చరణం 1:
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే.. పదాలలో నేనుంటే
వేకువ పూసిన తొలితొలి గీతిక
ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని
కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా.. తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చరణం 2:
సవ్వడి చేయని యవ్వన వీణలు
అల అలా సవరించు... పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా.. చలి కాచుకోనా
ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ.. పడుచాటలే సాగిపోని..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం
ఓ....ఓ...ఓ...ఓ...
pallavi:
he...he...he...he..
o...o...o...o..
priyarāgāle guṁḍĕlona pŏṁgudunna īveḽa
priyagānāle kannĕprema dosugunna śhubhaveḽa
serāli sŏgasula tīraṁ... sāgāli tagadhimi tāḽaṁ
taggāli tanuvula dūraṁ... tīrāli vayasula tābaṁ
o....o...o...o...
priyarāgāle guṁḍĕlona pŏṁgudunna īveḽa
priyagānāle kannĕprema dosugunna śhubhaveḽa
saraṇaṁ 1:
allari koyila pāḍina pallavi
svarālalo nīvuṁṭe.. padālalo nenuṁṭe
veguva pūsina tŏlidŏli gīdiga
priyā priyā nīvaide.. śhṛtilaya nenaudā
kalagālaṁ kaugilai.. ninne serugoni
kanurĕppala nīḍalo.. kale ŏdigi ponī
o priyā.. o.. dariseride dāsugonā.. tŏli premale dosugonā
priyarāgāle guṁḍĕlona pŏṁgudunna īveḽa
priyagānāle kannĕprema dosugunna śhubhaveḽa
saraṇaṁ 2:
savvaḍi seyani yavvana vīṇalu
ala alā savariṁchu... pade pade paligiṁchu
vayasulu korina vĕnnĕla madhuvulu
sakhi sĕli aṁdiṁchu... sukhālalo teliṁchu
pĕdavulado kammani.. kathe rāsugonā
ŏḍi seri vĕchchagā.. sali kāsugonā
o priyā.. o.. paruvālane paṁchugonī.. paḍusāḍale sāgiboni..
priyarāgāle guṁḍĕlona pŏṁgudunna īveḽa
priyagānāle kannĕprema dosugunna śhubhaveḽa
serāli sŏgasula tīraṁ... sāgāli tagadhimi tāḽaṁ
taggāli tanuvula dūraṁ... tīrāli vayasula tābaṁ
o....o...o...o...