Premamte suluvu kaaduraa..

ప్రేమంటే సులువు కాదురా..
Work
Year
Language

పల్లవి:

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనదీ తాకావా భగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా (2)

చరణం 1:

జాబిలినే బొమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బులతో మల్లెల పరుపేస్తావా ఆకాశం దిండుగ మార్చేస్తావా
ఇస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చేదా నీ నుదిటిన బొట్టు పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా మెరుపులతో కాటుకెట్టెదా

చరణం 2:

తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
ఎవరెస్టూ శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గాన్నే సృష్టిచేసేదా నీ ప్రేమకు కానుకిచ్చేదా
కైలాసం భువికి దించేదా నా ప్రేమను రుజువు చేసేదా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనదీ తాకావా భగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా

pallavi:

premaṁṭe suluvu kādurā adi nīvu gĕlava levurā
premiṁcha ṣharadulemiḍo aṁduloni marmamemiḍo
premĕṁto viluva ayinadi aṁdarigi dŏragalenidī
sūseṁdugu sakkanainadī tāgāvā bhaggumaṁṭadī
no no no alā sĕppagū manasuṁṭe mārgamuṁṭadī
sai aṁṭe sesisubudā logānigī sāḍi sĕppudā (2)

saraṇaṁ 1:

jābiline bŏmmaga sesistāvā bhūlogaṁ suṭṭi sigalo turimestāvā
mabbulado mallĕla parubestāvā āgāśhaṁ diṁḍuga mārsestāvā
istāvā tĕstāvā tĕstāvā
sūryuḍne paṭṭi tĕchchedā nī nudiḍina bŏṭṭu pĕṭṭĕdā
sukkalado sīra kaṭṭĕdā mĕrubulado kāḍugĕṭṭĕdā

saraṇaṁ 2:

tāj mahale nuvvu kaṭṭistāvā nāgosaṁ nayāgarā jalabādaṁ tĕstāvā
ĕvarĕsṭū śhikharamĕkkistāvā pasiphik sāgaramīdestāvā
vastāvā tĕstāvā tĕstāvā
svargānne sṛṣhṭisesedā nī premagu kānugichchedā
kailāsaṁ bhuvigi diṁchedā nā premanu rujuvu sesedā

premaṁṭe suluvu kādurā adi nīvu gĕlava levurā
premiṁcha ṣharadulemiḍo aṁduloni marmamemiḍo
premĕṁto viluva ayinadi aṁdarigi dŏragalenidī
sūseṁdugu sakkanainadī tāgāvā bhaggumaṁṭadī
no no no alā sĕppagū manasuṁṭe mārgamuṁṭadī
sai aṁṭe sesisubudā logānigī sāḍi sĕppudā