Poojalu seyaa poolu techchaanoo

పూజలు చేయా పూలు తెచ్చానూ
Work
Year
Language

పల్లవి:

పూజలు చేయా పూలు తెచ్చానూ

పూజలు చేయా పూలు తెచ్చానూ
నీ గుడి ముందే నిలిచానూ
తీయరా తలుపులనూ రామా
ఈయరా దర్శనమూ రామా

పూజలు చేయా పూలు తెచ్చానూ

చరణం 1:

తూరుపు లోనా తెల తెల వారే
బంగరు వెలుగూ నింగిని చేరే
తొలికిరణాలా ఆ.. ఆ.. ఆ.. ఆ..
తొలికిరణాలా హారతి వెలిగే
ఇంకా జాగేలా స్వామీ
ఈయరా దర్శనమూ రామా

పూజలు చేయ పూలు తెచ్చానూ

చరణం 2:

దీవించేవో కోపించేవో
చెంతకు చేర్చీ లాలించేవో
నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ
ఈయరా దర్శనమూ రామా

పూజలు చేయా పూలు తెచ్చానూ
నీ గుడి ముందే నిలిచానూ
ఈయరా దర్శనమూ రామా

పూజలు చేయా పూలు తెచ్చానూ

pallavi:

pūjalu seyā pūlu tĕchchānū

pūjalu seyā pūlu tĕchchānū
nī guḍi muṁde nilisānū
tīyarā talubulanū rāmā
īyarā darśhanamū rāmā

pūjalu seyā pūlu tĕchchānū

saraṇaṁ 1:

tūrubu lonā tĕla tĕla vāre
baṁgaru vĕlugū niṁgini sere
tŏligiraṇālā ā.. ā.. ā.. ā..
tŏligiraṇālā hāradi vĕlige
iṁkā jāgelā svāmī
īyarā darśhanamū rāmā

pūjalu seya pūlu tĕchchānū

saraṇaṁ 2:

dīviṁchevo kobiṁchevo
sĕṁtagu sersī lāliṁchevo
nī pada sannidhi nā pāliḍi pĕnnidhi
ninne nammidirā svāmī
īyarā darśhanamū rāmā

pūjalu seyā pūlu tĕchchānū
nī guḍi muṁde nilisānū
īyarā darśhanamū rāmā

pūjalu seyā pūlu tĕchchānū