Pillana grovi nenai ..sallani gaali nuvva

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వ
Year
Language

పల్లవి:

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం

చరణం 1:

మొదటి సారి నిను చూడగానే .. ఆశ్చర్యరాగం
మదిని తెరిచి మాటాడగానే .. ఆహ్వానరాగం
చొరవ చేసి నను చేరగానే .. ఆందోళరాగం
చెలిమి చేయి కలిపేయగానే .. అవలీలరాగం

నవ్వులోన నవనీత రాగం .. సిగ్గులోన గిలిగింతరాగం
ఒంపులోన ఒలికింత రాగం .. ఓపలేని విపరీత రాగం
అణువుఆణువున పలికెను మనలో .. అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం

చరణం 2:

ఇరువురం దూర దూరముంటే .. ఇబ్బందిరాగం
బంధమై స్పందించుతుంటే .. నిర్బంధరాగం
పెదవి మీటి పెనవేసుకుంటే .. నిశ్శబ్దరాగం
మధుర నిధిని దోచేసుకుంటే .. నిక్షేప రాగం

తనువులోన తారంగ రాగం .. క్షణముకొక్క కేరింతరాగం
కలలోన కల్లోల రాగం .. కలిసిపోతే కళ్యాణరాగం
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం ..అదే మోక్షరాగం

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం

pallavi:

pillana grovi nenai ..sallani gāli nuvvai
alluguboye rāgaṁ .. ānaṁda rāgaṁ
pillana grovi nenai ..sallani gāli nuvvai
alluguboye rāgaṁ .. ānaṁda rāgaṁ

rāgānige rūbaṁ ŏchchi .. rūbamilā ĕduruga nilisi
ālābiṁche rāgaṁ ...ātmīya rāgaṁ .. ade prema rāgaṁ

saraṇaṁ 1:

mŏdaḍi sāri ninu sūḍagāne .. āśhcharyarāgaṁ
madini tĕrisi māḍāḍagāne .. āhvānarāgaṁ
sŏrava sesi nanu seragāne .. āṁdoḽarāgaṁ
sĕlimi seyi kalibeyagāne .. avalīlarāgaṁ

navvulona navanīda rāgaṁ .. siggulona giligiṁtarāgaṁ
ŏṁpulona ŏligiṁta rāgaṁ .. obaleni vibarīda rāgaṁ
aṇuvuāṇuvuna paligĕnu manalo .. anurāga rāgaṁ .. ade prāṇa rāgaṁ

rāgānige rūbaṁ ŏchchi .. rūbamilā ĕduruga nilisi
ālābiṁche rāgaṁ ...ātmīya rāgaṁ .. ade prema rāgaṁ

saraṇaṁ 2:

iruvuraṁ dūra dūramuṁṭe .. ibbaṁdirāgaṁ
baṁdhamai spaṁdiṁchuduṁṭe .. nirbaṁdharāgaṁ
pĕdavi mīḍi pĕnavesuguṁṭe .. niśhśhabdarāgaṁ
madhura nidhini dosesuguṁṭe .. nikṣheba rāgaṁ

tanuvulona tāraṁga rāgaṁ .. kṣhaṇamugŏkka keriṁtarāgaṁ
kalalona kallola rāgaṁ .. kalisibode kaḽyāṇarāgaṁ
iddaramŏgaḍai mudduga uṁṭe advaida rāgaṁ ..ade mokṣharāgaṁ

pillana grovi nenai ..sallani gāli nuvvai
ālābiṁche rāgaṁ ...ātmīya rāgaṁ .. ade prema rāgaṁ