పల్లవి:
పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయడు చూసే వేళ
కలువల రాయడు చూసే వేళ
చెలియను కవ్వింతు వేలా !యేలా!
కలువల రాయడు చూసే వేళా
చరణం 1:
చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు ..మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు తొందర చేసెను నీలోన ॥
చరణం 2:
జగములనేలే సొగసే నీదని
జగములనేలే సొగసే నీదని గగనములో దాగే నెలరేడు
మనసును దోచే మరుడవు నీవని
మనసును దోచే మరుడవు నీవని కనుగొంటినిలే ఈనాడు ॥
pallavi:
pilisina palugavu o javarālā
pilisina palugavu o javarālā
silibiga nanusera rāvā! rāvā!
pilisina palugavu o javarālā
kaluvala rāyaḍu sūse veḽa
kaluvala rāyaḍu sūse veḽa
sĕliyanu kavviṁtu velā !yelā!
kaluvala rāyaḍu sūse veḽā
saraṇaṁ 1:
sallaga virise nī sirunavvulu
sallaga virise nī sirunavvulu ..mallĕlu kurisĕnu nālona
tŏlisūbulalo siligina valabulu
tŏlisūbulalo siligina valabulu tŏṁdara sesĕnu nīlona ||
saraṇaṁ 2:
jagamulanele sŏgase nīdani
jagamulanele sŏgase nīdani gaganamulo dāge nĕlareḍu
manasunu dose maruḍavu nīvani
manasunu dose maruḍavu nīvani kanugŏṁṭinile īnāḍu ||