Pichchi pichchi pichchi ragaragaala pichchi

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
Year
Language

పల్లవి:

"చావే ఎరుగని ఇంటినుంచి ఆవాలు తెమ్మన్నాడట బుద్ధుడు
అలాగే మచ్చుకు ఏ పిచ్చిలేని ఒక మనిషిని చూపండి ఈనాడు"

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

చరణం 1:

మనసుంటేనే పిచ్చి, మతి ఉంటేనే పిచ్చి
మనసుంటేనే పిచ్చి, మతి ఉంటేనే పిచ్చి
మంచితనం అన్నింటిని మించిన పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చీ

చరణం 2:

వెర్రిమొర్రిగా ప్రేమించడము కుర్రవాళ్ల పిచ్చి
కస్సుబుస్సుమని ఖండించటము కన్నవాళ్ళ పిచ్చి
భక్తి పిచ్చి.. ముక్తి పిచ్చి.. విరక్తి పిచ్చి..
పదవుల పిచ్చి.. పెదవుల పిచ్చి.. మధువుల పిచ్చీ.. ఈ ఈ ఈ ...

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

చరణం 3:

చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి
చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి
ఆ దేవుడి కోసం దేవులాడటం.. మనుషుల పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చీ...

ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలని పిచ్చి
వాడ్ని లేనివాడిగా చేయాలని లేనివాకి పిచ్చి
ఉన్నది లేదు లేనిది ఉంది అన్నది పిచ్చి
నేనన్నది పిచ్చని అన్నవారికే ఉన్నది పిచ్చీ.. ఈ ఈ ఈ ...

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

pallavi:

"sāve ĕrugani iṁṭinuṁchi āvālu tĕmmannāḍaḍa buddhuḍu
alāge machchugu e pichchileni ŏga maniṣhini sūbaṁḍi īnāḍu"

pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi

pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi

saraṇaṁ 1:

manasuṁṭene pichchi, madi uṁṭene pichchi
manasuṁṭene pichchi, madi uṁṭene pichchi
maṁchidanaṁ anniṁṭini miṁchina pichchi

pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi
pichchi pichchi pichchī

saraṇaṁ 2:

vĕrrimŏrrigā premiṁchaḍamu kurravāḽla pichchi
kassubussumani khaṁḍiṁchaḍamu kannavāḽḽa pichchi
bhakti pichchi.. mukti pichchi.. virakti pichchi..
padavula pichchi.. pĕdavula pichchi.. madhuvula pichchī.. ī ī ī ...

pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi

saraṇaṁ 3:

sīgaḍivĕlugulu kaṣhṭasukhālu sṛṣhṭiṁchaḍame devuḍi pichchi
sīgaḍivĕlugulu kaṣhṭasukhālu sṛṣhṭiṁchaḍame devuḍi pichchi
ā devuḍi kosaṁ devulāḍaḍaṁ.. manuṣhula pichchi

pichchi pichchi pichchī...

unnavāḍigi iṁkā iṁkā kāvālani pichchi
vāḍni lenivāḍigā seyālani lenivāgi pichchi
unnadi ledu lenidi uṁdi annadi pichchi
nenannadi pichchani annavārige unnadi pichchī.. ī ī ī ...

pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi
pichchi pichchi pichchi ragaragāla pichchi
e pichchī ledanuguṁṭe adi achchamaina pichchi