You are here

Navamanmadhudaa adi sumdarudaa

Title (Indic)
నవమన్మధుడా అతి సుందరుడా
Work
Year
Language
Credits
Role Artist
Music M.M. Keeravani
Performer K.S. Chitra
Writer

Lyrics

Telugu

పల్లవి:

నవమన్మధుడా.. అతి సుందరుడా.. నువు చూసిన ఆ ఘనుడు
అక్కా...ఎవరే అతగాడు..ఇట్టే..నీ మనసును దోచాడు

శ్రీరాఘవుడా..ప్రియ మాధవుడా.. నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ...ఎవరే అతగాడు..తుళ్ళీ..నీ వయసుకు జతగాడు

చరణం 1:

గోరు వెచ్చని ఊపిరి.. వేయి వేణువులూదగా.. తొలి ముద్దు చిందించెనే..
వీణమీటిన తీరుగా..ఒళ్ళు జల్లనే హాయిగా.. బిగి కౌగిలందించెనే..

రతి రాగాలే..శ్రుతి చేసాడే.. జత తాళాలే.. జతులాడాడే...
తనువంత వింత సంగీతమేదో పలికే....

అక్కా...ఎవరే అతగాడు..ఇట్టే..నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా..ప్రియ మాధవుడా.. నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ...ఎవరే అతగాడు..తుళ్ళీ..నీ వయసుకు జతగాడు

చరణం 2:

వాడి చూపుల దాడితో..వేడి ఆవిరి రేపెనే.. నిలువెల్ల తారాడెనే...
చాటు మాటున చోటులో..ఘాటు కోరిక లూపెనే..ఒడి చేరి తలవాల్చెనే...

జడ లాగాడే.. కవ్వించాడే..నడు ఒంపుల్లో చిటికేశాడే..
అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే...

చెల్లీ...ఎవరే అతగాడు..తుళ్ళీ..నీ వయసుకు జతగాడు
నవమన్మధుడా.. అతి సుందరుడా.. నువు చూసిన ఆ ఘనుడు
అక్కా...ఎవరే అతగాడు..ఇట్టే..నీ మనసును దోచాడు

శ్రీరాఘవుడా..ప్రియ మాధవుడా.. నువు వలచిన ఆ ప్రియుడు...

English

pallavi:

navamanmadhuḍā.. adi suṁdaruḍā.. nuvu sūsina ā ghanuḍu
akkā...ĕvare adagāḍu..iṭṭe..nī manasunu dosāḍu

śhrīrāghavuḍā..priya mādhavuḍā.. nuvu valasina ā priyuḍu
sĕllī...ĕvare adagāḍu..tuḽḽī..nī vayasugu jadagāḍu

saraṇaṁ 1:

goru vĕchchani ūbiri.. veyi veṇuvulūdagā.. tŏli muddu siṁdiṁchĕne..
vīṇamīḍina tīrugā..ŏḽḽu jallane hāyigā.. bigi kaugilaṁdiṁchĕne..

radi rāgāle..śhrudi sesāḍe.. jada tāḽāle.. jadulāḍāḍe...
tanuvaṁta viṁta saṁgīdamedo palige....

akkā...ĕvare adagāḍu..iṭṭe..nī manasunu dosāḍu
śhrīrāghavuḍā..priya mādhavuḍā.. nuvu valasina ā priyuḍu
sĕllī...ĕvare adagāḍu..tuḽḽī..nī vayasugu jadagāḍu

saraṇaṁ 2:

vāḍi sūbula dāḍido..veḍi āviri rebĕne.. niluvĕlla tārāḍĕne...
sāḍu māḍuna soḍulo..ghāḍu koriga lūbĕne..ŏḍi seri talavālsĕne...

jaḍa lāgāḍe.. kavviṁchāḍe..naḍu ŏṁpullo siḍigeśhāḍe..
adharāladonĕ śhubhalekha rāsĕ maruḍe...

sĕllī...ĕvare adagāḍu..tuḽḽī..nī vayasugu jadagāḍu
navamanmadhuḍā.. adi suṁdaruḍā.. nuvu sūsina ā ghanuḍu
akkā...ĕvare adagāḍu..iṭṭe..nī manasunu dosāḍu

śhrīrāghavuḍā..priya mādhavuḍā.. nuvu valasina ā priyuḍu...

Lyrics search